Thursday, November 27, 2025

#GummadiKayaDeepaalu #KushmandaDeepaalu #KushmandaBaliDeepam #What Is #GummadiKayaDeepaalu #GummadiKayaDeepamSideeffects #KusmandaDeepamSideeffects #KushamandaDeepamVeryDanger⚡ఈ గుమ్మడికాయ బలి హోమ ప్రక్రియలో మంత్ర పూర్వకంగా మాత్రమే చేస్తారు. ఎవరు బడితే వారు ఎక్కడబడితే అక్కడ వెలిగించడం అనర్ధాన్ని కలిగిస్తుంది. #గుమ్మడికాయబలిదీపాలు వెలిగించాలి అంటే తలారా స్నానమాచరించి, తడి బట్టలలో, పండితుల ఆధ్వర్యంలో బలిదాన మంత్రమును పటిస్తూ గుమ్మడికాయని బద్దలు కొట్టి లోపల పసుపు రాసి, ఎనిమిది చోట్ల బొట్లు పెట్టి, అష్టభైరవులను ఆవాహన చేసి, పంచోపచార పూజ చేసి అష్టదిక్కులకు అష్ట జ్యోతిలను మంత్రపూర్వకంగా వెలిగించి ఆ దీపం వెలిగే వరకు అక్కడే కూర్చుని దీపం నిథనమైన తరువాత దానిని దూరంగా ఎక్కడైనా జంతువులు తిరగరాని ప్రదేశంలో వదిలేసి మరలా తలారా స్నానం చేసి, పొడి బట్టలు మార్చుకొని దేవతా దర్శనం చేసుకోవాలి. ఇంటిలో మాత్రం ఎప్పుడూ వెలిగించరాదు. ఇది కొన్ని దోషాలను కలిగిస్తుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు సృష్టిస్తుంది. ఈ గుమ్మడి కాయ బలి దీపాల పట్ల అవగాహన లేని వారు ఎవరో చెప్పిన లేనిపోని మాటలు విని కోరి దోషాలను ఆటంకాలను కోరి తెచ్చుకోవద్దు. అనేది గురువుల యొక్క సలహా. #KalabhairavaTV https://youtube.com/c/Kalabhairavatv

Monday, November 24, 2025

#మార్గశిరమాసం 21.11.2025 శుక్రవారం నుండి 20.12.2025 వరకు #కాలభైరవజయంతి #KalabhairavaJayanthi #Kalabhairavashtami 12.12.2025*మార్గశిరమాసం జీవిత లక్ష్యాలను, అభీష్టాలను సాధించడం కోసం మార్గాలను సుగమం చేసే మాసం. అంటే ఈ మాసంలో మనం ఏదైనా అనుకుంటే శీఘ్రంగా ఫలిస్తుంది. ఎందుకంటే ఈ మాసంలో సాక్షాత్తు మహాదేవుని నుండి #రుద్రాంశసంభూతుడు, #దిగంబరుడు, #ధర్మదాత, #విధాత, సంధాత, #కాలప్రభువు, రక్షకులందర్నీ శాసించే క్షేత్రపాలకుడు కాలాన్ని శాసించే కాలస్వరూపుడు #కాలభైరవుడు ఆవిర్భవించిన మార్గశిర మాసంలోనే భగవద్గీత అవతరించింది, శ్రీకృష్ణుడు దీనిని "మాసానాం మార్గశీర్షోహం" అని పేర్కొన్నాడు. #WhoIsKalabhairava #WhenIsKalabhairavashtami#SwarnakarshanaBhairavaTemple#స్వర్ణాకర్షణభైరవదేవాలయం #KalabhairavaTV #KalabhairavaGuru #RAJAHMUNDRYKALABHAIRAVATEMPLE#KaryaSiddhiKalabhairavaTempleRajahmundry కార్యసిద్ధికాలభైరవఆలయంరాజమండ్రి🛕మీకు స్వాగతం - సుస్వాగతం🛕 కార్యసిద్ధికాలభైరవస్వామి వారి స్వర్ణాకర్షణకాలభైరవ స్వామి వారి, వజ్రవారాహీఅమ్మవారి దర్శనం ప్రతి ఆదివారం అమావాస్య అష్టమి పౌర్ణమి రోజుల్లో ఉదయం7:30 నుండి మధ్యాహ్నం11:45 వరకు ఉంటుంది.MORNING 7:30 AM To AFTERNOON 11:45AM ONLY.#గుడిఅడ్రస్ 👇 లొకేషన్https://maps.app.goo.gl/xkBo2CcGiN14emoK7?g_st=acవివరాలకు👇 https://www.facebook.com/kalabhairavaTVhttps://youtube.com/c/Kalabhairavatv 🙏Thanks For Your Support..వివరాలకు వాట్సాప్ 📱@9000200117ఈ మాసంలో కాలభైరవ మహాకాళి దశమహావిద్య సాధన ఉపాసన అనుష్టానం ఆరాధన, ముఖ్యంగా ఆదివారాలలో చేసే పూజలు, ఉపవాసాలు విశిష్ట ఫలితాలనిస్తాయి. ఈ నెలలో కార్తికేయుడు, దత్తాత్రేయుడు కూడా అవతరించారు.మార్గశిర మాసం యొక్క విశిష్టతలు:భగవద్గీత మాసం: శ్రీకృష్ణుడు భగవద్గీతను ఈ మాసంలోనే బోధించాడు. మహాకాళి కాలభైరవ ప్రీతి: ఈ మాసం శ్రీ కాలభైరవ స్వామి వారికి శ్రీ మహాకాళి మాతకు చాలా ప్రీతికరం. ఆదివారాల ప్రాముఖ్యత: మార్గశిర ఆదివారాలను "మార్గశిర భానువారాలు" అని పిలుస్తారు మరియు వీటిని శ్రీ మహా కాళీ కాలభైరవ పూజలకు అంకితం చేస్తారు. వైకుంఠ ఏకాదశి: మార్గశిర శుక్ల ఏకాదశిని "వైకుంఠ ఏకాదశి" అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఆధ్యాత్మిక అనుష్ఠానాలు: ఈ నెలలో దీపారాధన, కాలభైరవ సహస్రనామ పారాయణం, సాత్విక ఆహారం పాటించడం వంటివి చేస్తారు. ఓం శ్రీ గురుభ్యోనమః ది 12.12.2025 శుక్రవారం కాలభైరవ జయంతి కాలభైరవాష్టమి కాలభైరవ గురు సంస్థాన్ మఠం రాజమండ్రిశ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ దేవాలయంలో నిర్వహించు కార్యక్రమాలు 1.కార్యసిద్ధి కాలభైరవ స్వామికి కంకాల హారతి సేవ ఉదయం 7 గం.లకు, ఈ కలియుగంలో కాల ద్వారా కలిగే సర్వకష్టాల నుండి, దోషాల నుండి, సమస్యల నుండి విముక్తి కలిగించమని వేడుకొంటూ చేసే సేవయే కంకాల హారతి సేవ కార్యసిద్ధి కాలభైరవ స్వామి వారికి ప్రీతికరమైనది. 2.స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారికి సర్పాహారతి సేవ 3.ధన ప్రసాద సేవ4.అన్నప్రసాద సేవ 5.కార్యసిద్ధి కాలభైరవ దీప పూజ 5.మాస పూజలు 6.కాలభైరవ స్వామికి విశేష పూజలు హోమాలు7.రాజ శ్యామల మాతకు విశేష పూజలు హోమాలు 8. శ్రీ వారాహీ మాతకు విశేష పూజలు హోమాలు9.మంత్రోపదేశ సేవ విశేష పౌర్ణమి పర్వదినాల్లో మంత్రోపదేశ సేవలు జరుగును 10.కాలభైరవ దీక్షలు మార్గశిర బహులాష్టమి కాలభైరవ జయంతికి ముందు 41 రోజుల 21 రోజుల 11 రోజుల కాలభైరవ దీక్షను స్వీకరించవచ్చు.

Friday, November 14, 2025

#మంత్రోపదేశం #Mantropadesham #మంత్రంసాధన చేసేవారు, లేదా మంత్రం పట్ల శ్రద్ధ ఉన్నవారు, లేదా #మంత్రోపాసన చేయాలనుకునేవారు,లేదా జీవిత సత్యాన్ని సాధించాలనుకునేవారు, లేదా జన్మ సార్ధకత కావాలనుకునేవారు, లేదా ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చుకోవాలనుకునేవారు, ఈ జన్మకు ముక్తి మోక్షము కావాలనుకునేవారు మంత్ర దేవత యందు, గురువు నందు పూర్తి విశ్వాసము భక్తి శ్రద్ధ చిత్తశుద్ధితో అడిగితేనీ కానీ ఇవ్వకూడదు మంత్రము. ఒక్కొక్కప్పుడు గురువుల అనంత అవ్యాజమైన కృపతో ఇస్తారు. గురువును దర్శించి, భక్తి పూర్వకంగా అడగాలి. శిష్యుని కొంతకాలం పరీక్షించి ఇవ్వాలి గురువు. మంత్రాన్ని ఇవ్వడం అంటే గురువు తన జీవితంలో జపం చేసి సాధన చేసినటువంటి శక్తిని అక్షర రూపంలో దేవతను ఇవ్వడమే. మరియు మంత్రశక్తిని శిష్యునికి ధారబోయడమే మంత్రఉపదేశం.అలా ఉపదేశం పొందినటువంటి శిష్యుడు జీవిత కాలం మంత్ర దేవత యందు గురువు యందు చిత్తశుద్ధి కృతజ్ఞత కలిగి ఉండాలి అప్పుడే మంత్ర దేవత యొక్క అనుగ్రహం చేత శిష్యునికి సర్వ అభిష్టాలు నెరవేరుతాయి.మంత్రాన్ని అక్షరంగా చూసేవాడు, గురువును మనిషిలా చూసేవాడు, విగ్రహాన్ని శిలలా చూసేవాడు ఎన్నటికీ మంత్ర సిద్ధి కలగదు. విగ్రహంపై శిలాదృష్టి, గురువుపై మానుష దృష్టి, మంత్రంపై అక్షరదృష్టి కూడదు. సాక్షాత్ భగవదృష్టి ఉండాలి. ఏ మంత్రమైనా సరే గురు అణుజ్ఞతో, గురు ఉపదేశంతో సిద్ధిస్తుంది. ఇప్పటికే ప్రత్యక్షంగా పరోక్షంగా 109 మంత్రోపదేశములు విజయవంతంగా సంపూర్ణం చేయడం, ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 16450 మంది భక్తులు పాల్గొని తరిస్తున్నారు. మన కాలభైరవ గురు సంస్థాన్ మఠం రాజమండ్రి ఆధ్వర్యంలో #పూజ్యశ్రీకాలభైరవస్వామీజీ వారి పర్యవేక్షణలో #110వమంత్రోపదేశం త్వరలో జరుగునని తెలియజేయుటకు మిక్కిలి సంతోషిస్తున్నాము.ఈ ముఖ్య సమాచారాన్ని ఆధ్యాత్మిక అభివృద్ధి కావాలనుకునే మన ఆత్మబంధువులకు షేర్ చేయండి. మరిన్ని వివరాలకుhttps://www.facebook.com/kalabhairavaTVమంత్రోపదేశ క్షేత్రం కొరకు క్లిక్ చేయండి.https://maps.app.goo.gl/xkBo2CcGiN14emoK7?g_st=acమరిన్ని వివరాలకు వాట్సప్ ద్వారా సంప్రదించవచ్చు.📱@9000200117

Saturday, November 8, 2025

#KarteekaKotiDeepotsavam #KotiDeepotsavam #RajahmundryKotiDeepotsavam #KaliKotiDeepotsavam #KotiDeepotsavam #KarteekaKotiDeepotsavam #కాలభైరవక్షేత్రంలోకోటిదీపోత్సవం స్వాగతం - సుస్వాగతం *రాజమండ్రి కాలభైరవక్షేత్రంలో కోటిదీపోత్సవం**ది.09.11.2025 ఆదివారం సాయంత్రం 6గంటలకు*కార్తీక మాసం సందర్భంగా రాజమండ్రి నగరంలోని ఆర్యాపురంలో కాలభైరవ గురు సంస్థాన మఠం, శ్రీస్వర్ణాకర్షణ కాలభైరవ దేవాలయం, కాలభైరవదీక్ష ఘాట్ లో భారతీయ సనాతన ధర్మ కాలభైరవ తత్వ ప్రచారకులు, మహామంత్రోపదేశకులు పరమపూజ్య శ్రీ శ్రీ శ్రీ కాలభైరవ స్వామీజీ వారి ఆధ్వర్యంలో *కోటిదీపోత్సవం #KotiDeepotsavam* జరుగును. కావునా భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ స్వహస్తాలతో స్వయంగా మూలవిరాట్ కు అభిముఖంగా గోదావరి ఒడ్డున కార్తీక దీపాలను వెలిగించి పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రలు కాగలరు.ఇట్లు:భారతీయ సనాతన ధర్మ పరిషత్ - ఆంధ్రప్రదేశ్.కాలభైరవ గురు పరివార్ రాజమండ్రి శాఖ.

Friday, November 7, 2025

#WhoIsKalaBhairavSwamyji? #WhoIsKalaBhairavaGuruji? #RajahmundryKalaBhairavaTemple Is Famous Temple in World. #KalaBhairavaGuru #KalaBhairavaTemple ఇలా భక్తులే స్వయంగా మూలవిరాట్ కు సర్పహారతి ఇచ్చుకునే అవకాశం ఉన్న దేవాలయం ఎక్కడైనా ఉన్నదా?మీ అనుభూతి ఏమిటి? #kalabhairavatemple #పూజ్యశ్రీకాలభైరవస్వామిజీ 🛕భారతీయ సనాతనధర్మ, కాలభైరవ తత్వ ప్రచార సంస్థ 🚩కాలభైరవ గురు సంస్థాన్ మఠం రాజమండ్రి శ్రీస్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి క్షేత్రం* 🙏స్వామి వారి, అమ్మవారి దర్శనం ప్రతి ఆదివారం అమావాస్య అష్టమి పౌర్ణమి రోజుల్లో ఉదయం.7:30 నుండి మధ్యాహ్నం.11:45 వరకు ఉంటుంది🕉️12డిసెంబర్2025 🔱కాలభైరవాష్టమి🔯 సందర్భంగా 5రోజుల పాటు 08.12నుండి 12.12వరకు రోజూ 5హోమాలు *పంచ మహా🔥హోమాలు* మీ గోత్ర నామాలతో స్వామివారికి 💧రుద్రాభిషేకము, 🪔కంకాల హారతి, కాకడ్ ధూపహారతి, 🌿బిల్వార్చన, సహస్ర నామ 💲నాణాల పూజల్లో, గణపతి, సుబ్రహ్మణ్య, గురు, స్వర్ణాకర్షణ, కాలభైరవ 🔥హోమాలు & *కాలభైరవ జయంతి రోజు 🥗మహా అన్నదానము నిర్వహించబడును* సేవాదక్షిణ రూ.1550/- 9985551028 కు GPay, PhonePay ద్వారా పంపించి, ఆ స్క్రీన్ షాట్ మరియు మీ గోత్రం, పేరు, అడ్రస్ ఈ వాట్సప్ నెంబర్ 9985551028 కు పంపించి మీరు ప్రత్యక్షంగా/పరోక్షంగా ఈ సేవల్లో పాల్గొనవచ్చు🙌ప్రసాదముగా అనుక్షణం రక్షించే కాలభైరవస్వామి 📿మణికట్టుశక్తి కంకణం, మెడలో ధరించడానికి భైరవ ముద్రా డాలర్, హోమభస్మం, రుద్రాక్ష, శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి ధనప్రసాదం మరియు ప్రసాదం పోస్ట్ ద్వారా పొందగలరు. గమనిక: హోమానికి కావాలసిన సామాగ్రి మొత్తం అన్ని ఇక్కడే ఇస్తారు. హోమానికి మీరు ఏ విధమైన సామాగ్రి తీసుకురావాల్సిన అవసరం లేదు. అనుకున్న సమయానికి సంప్రదాయ వస్త్రధారణలో అనగా మగవారు పంచే - కండువా , స్త్రీలు చీర, మెడలో కండువా లేదా తుమాలు ధరించి రావాలి. హోమ కుండంలో ద్రవ్యాలు, ఆహుతులు వేసేటప్పుడు గురువు గారు చెప్పే విధంగా పంచ మహా హోమ దేవతా మంత్రములు స్మరిస్తూ వేస్తూ ఉండాలి. వివరాలకోసం *998 555 1028* ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి లేదా వాట్సప్ ద్వారా సంప్రదించగలరు. (గమనిక: ఉదయం 10 గం.నుండి సాయంత్రం 5గం. వరకు మాత్రమే ఈ నంబర్ అందుబాటులో ఉంటుంది.) https://youtube.com/shorts/1-HDPX-GN3k?si=CS_HvlDqqzZ8_5Xw📱@9985551028Temple Location👇https://maps.app.goo.gl/xkBo2CcGiN14emoK7?g_st=ac👉https://www.facebook.com/kalabhairavaTV👍https://youtube.com/c/Kalabhairavatv

Tuesday, November 4, 2025

#స్వర్ణాకర్షణభైరవదేవాలయం #KalabhairavaTV #KalabhairavaGuru2025నవంబర్ నెలలో స్వర్ణాకర్షణ కాలభైరవ టెంపుల్ దర్శనం తేదీలు Rajahmundry Kalabhairava Temple Darshanam Dates In November2025 KaryaSiddhi Kalabhairava Temple Rajahmundry రాజమండ్రి 🛕కాలభైరవగురు సంస్థాన్ మఠం రాజమండ్రి Thanks For Your Support 🏹 🔯2025నవంబర్ నెలలో రాజమండ్రి🔱శ్రీస్వర్ణాకర్షణ కాలభైరవస్వామి దర్శనం తేదీలు🕉️02.11.2025 ఆదివారం05.11.2025 కార్తీకపూర్ణిమ బుధవారం09.11.2025 ఆదివారం12.11.2025 కాలాష్టమి బుధవారం16.11.2025 ఆదివారం 21రోజులుకాలభైరవదీక్షలు ప్రారంభం19.11.2025 బుధవారం కార్తీకఅమావాస్య 20.11.2025 గురువారం కార్తీకఅమావాస్య 23.11.2025 ఆదివారం28.11.2025 మార్గశిర అష్టమి శుక్రవారం 30.11.2025 ఆదివారం11రోజులుకాలభైరవదీక్ష ప్రారంభం🔥12.12.2025 కాలభైరవ జయంతి కాలభైరవాష్టమి శుక్రవారం🔱https://www.facebook.com/kalabhairavaTV 📱@9985551028గుడి అడ్రస్ 👇 లొకేషన్https://maps.app.goo.gl/xkBo2CcGiN14emoK7?g_st=acవివరాలకు👇 https://www.facebook.com/kalabhairavaTVhttps://youtube.com/c/Kalabhairavatv

Monday, November 3, 2025

#స్వర్ణాకర్షణభైరవమంత్రం #ధనాకర్షణభైరవమంత్రం #కాలభైరవమహామంత్రం #స్వర్ణాకర్షణదేవాలయం #SwarnakarshanaBhairavaMantram సాక్షాత్తు మహాశివుడే స్వర్ణాకర్షణభైరవ స్వామిగా వెలసిన క్షేత్రం అప్పుల బాధల నుండి వడ్డీల బాధల నుంచి అతిశీఘ్రంగా విముక్తి కలిగించి సర్వసంపదలను సకల సుఖాలను అనుగ్రహించే స్వర్ణాకర్షణ కాలభైరవ మంత్రం మీ ఇంట్లో రోజు ఉదయం 4:30 నిమిషాల నుండి ఉదయం 6:30 నిమిషాల మధ్యకాలంలో తూర్పుముఖంలో సుఖాసనం కూర్చుని 5మాలలు జపం చేయండి. స్వామివారి దర్శనం ప్రతి ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో మాత్రమే ఉంటుంది. #స్వర్ణాకర్షణభైరవదేవాలయం #పూజ్యశ్రీకాలభైరవస్వామిజీ #KalabhairavaTV #KalabhairavaGuru #KalabhairavaSwamy #కాలభైరవగురు

Saturday, October 25, 2025

#Kalabhairav Jayanthi 2025 #KalaBhairavashtami 2025 #కాలభైరవజయంతి2025 విశిష్టత ఏంటి? 12.12.2025 శుక్రవారం ఎలా పూజించాలి? సవివరంగా మీకోసం! #స్వర్ణాకర్షణభైరవదేవాలయం #పూజ్యశ్రీకాలభైరవస్వామిజీ జీవితంలో ఏదైనా సమస్తమైన కష్టాలను బాధలను దుఃఖాలను శత్రుభయాలను గ్రహభయాలను రోగభయం, ప్రతికూల శక్తులను తొలగించే కాలభైరవజయంతిపూజ. నాణాలను ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రం గా వర్ధిల్లుతున్న రాజమండ్రిలో ప్రత్యేకముగా కాలభైరవజయంతి పూజలు, కాలభైరవజయంతి హోమాలు, కాలభైరవ దీక్షలు, కాలభైరవ దీక్షా పూర్ణాహుతి, కాలభైరవ మాలా విరమణ, కాలభైరవ రథ యాత్రలు జరుగును. #KalabhairavaTV #kalabhairaguru Kalabhairav Jayanti Significance In Telugu : ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలంటారు. ఎంత సంపాదించినా మంచి ఆరోగ్యం లేకపొతే వృధానే! ఎన్ని మందులు వాడినా ఫలితం లేని మొండి రోగాల నుంచి విముక్తి పొందడానికి, ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించుకోడానికి కాలభైరవ జయంతి రోజు కాలభైరవుని పూజించాలని మహా మంత్రోపదేశకులు, అంతర్జాతీయ కాలభైరవ తత్వ ప్రచారకులు పరమపూజ్య శ్రీ కాలభైరవ స్వామీజీ వారు ఈ విధంగా వివరిస్తున్నారు. ఈ సందర్భంగా కాలభైరవ జయంతి ఎప్పుడు వచ్చింది? ఆ రోజు ఎలాంటి పూజలు చేయాలి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఎవరీ కాలభైరవుడు?సాక్షాత్తు పరమశివుడే కాలభైరవుడు. వ్యాస మహర్షి రచించిన శివ మహా పురాణం ప్రకారం ఒకానొక సందర్భంలో బ్రహ్మ, విష్ణువు మధ్య విశ్వాన్ని ఎవరు కాపాడుతున్నారు? పరతత్వం ఎవరు? అనే అంశం చర్చకు దారి తీసింది. ఈ వివాదాంశం గురించి మహర్షులు 'సమస్త విశ్వానికి మూలమైన పరతత్వం ఒక్క మాటలో తేల్చి చెప్పడానికి వీలు కానిది. ఇందుకు కారణం విష్ణువు బ్రహ్మ ఇద్దరూ ఆ శక్తి విభూతి నుంచి ఏర్పడిన వారే కదా!' అన్నారు ఋషులు. ఈ విషయానికి సంబంధించి బ్రహ్మ దేవుడు, విష్ణువు దేవతలందరితో పాటుగా శివుడిని సంప్రదించారు. ఆ సమయంలో దేవతలందరూ ఒకచోట కూర్చుని ఆ పరమేశ్వరుడే సృష్టికి మూలమని తేల్చారు. అయితే బ్రహ్మదేవుడు దీనిని అంగీకరించకుండా శివుని దూషించాడు. అప్పుడు శివుడు, బ్రహ్మ అహంకార గర్వ భంగం కోసం తన అంశ నుండి కాలభైరవ అవతారము ఆవిర్భవించింది. ఈ బైరవ అవతారానికి కారణమైన రోజు మార్గశిర బహుళ అష్టమి కావడం వల్ల ఆ రోజు "కాలభైరవాష్టమి" గా "కాలభైరవ జయంతి" గా, ప్రసిద్ధి చెందింది.కాలభైరవాష్టమి ఎప్పుడు? ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో బహుళ పక్షంలో అష్టమి తిథి నాడు కాల భైరవ జయంతిని జరుపుకుంటారు. ఈ సందర్భంగా డిసెంబర్ 12వ తేదీ శుక్రవారం రోజు కాలభైరవ జయంతి జరుపుకోవాలని పరమ పూజ శ్రీ కాలభైరవ స్వామీజీ వారు సూచిస్తున్నారు. సాధారణంగా కాలభైరవ పూజ రాత్రి సమయాలలో గురు మంత్రాలను, జపం, హోమం నిర్వహిస్తారు. రాజమండ్రిలో ఈ కాలభైరవ జయంతి పర్వదినాన మరియు ప్రతి ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు దర్శనం ఉంటుంది. కాలభైరవ స్వరూపంపరమశివుని స్వరూపమైన కాలభైరవుడు ఉగ్రరూపంతో ఉంటాడు. కాలభైరవుని వాహనం శునకం. అంతేకాదు పరమ పావనమైన కాశీ క్షేత్ర పాలకుడు కూడా కాల భైరవుడు. అందుకే వారణాశి వెళ్లిన వారు కాలభైరవుని కూడా తప్పకుండ ధూల్ దర్శనం చేసుకుంటారు. దక్షిణ భారతదేశంలో ఉన్నవారు తప్పనిసరిగా గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరంలో ఉన్న శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి దర్శనం చేసుకుని గారెల దండలు, నీలి శంకు పూలదండలు, కార్యసిద్ధి కాలభైరవ దీపాలు సమర్పణ చేస్తారు.కాలభైరవాష్టమి విశిష్టతకాలభైరవాష్టమి రోజున కాలభైరవుడిని పూజించడం ద్వారా రోగ భయం, మృత్యు భయం నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం. విశేషించి ఈ రోజున కాలభైరవుడిని పూజించిన వారికి అన్ని రకాల వ్యాధుల నుంచి, దుష్టశక్తుల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. అలాగే ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయని, కాల భైరవుని మంత్రం పఠించడం వల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయని స్వామీజీ తెలియజేస్తున్నారుకాలభైరవాష్టమి పూజావిధానంకాల భైరవుని జయంతి రోజున కాల భైరవుడితో పాటు కాళీమాతను పూజించాలి. అష్టమి కి ముందు సప్తమి తిథి రోజున అర్ధరాత్రి కాళరాత్రి దేవిని పూజిస్తారు. ఈ తర్వాతే కాలభైరవుడిని పూజిస్తారు. కాలాష్టమి తిథి కాలంలో పరమేశ్వరుడిని కూడా పూజించడం పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున పూజలు చేసే వారు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్న భక్తులు రాత్రి జాగరణ కూడా చేయాలి. ఉపవాసం ఉండే వారు రాత్రి వేళ ఉపవాసాన్ని విరమించి పండ్లు, పాలు మాత్రమే తీసుకోవాలి. ఆ మరుసటి రోజే తిరిగి కాలభైరవుని దర్శించిన తర్వాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి.కాలభైరవ పూజాఫలంకాలభైరవాష్టమి రోజు కాలభైరవుని పూజించడం ద్వారా శత్రుభయం, అపమృత్యు భయం, రోగభయం తొలగిపోతాయని విశ్వాసం. అలాగే తరచుగా పనులలో ఆటంకాలు ఎదురవుతుంటే కాలభైరవాష్టమి రోజు కాలభైరవుని భక్తిశ్రద్ధలతో పూజిస్తే ప్రతికూల శక్తులు తొలగి పనుల్లో సానుకూలత ఉంటుందని విశ్వాసం. అలాగే ఈ రోజు కాలభైరవుని వాహనమైన నల్ల కుక్కకు కుంకుమతో బొట్టు పెట్టి, గారెలతో తయారు చేసిన మాల వేయడం వలన సమస్త గ్రహ దోషాలు పోతాయని విశ్వాసం. రానున్న కాలభైరవాష్టమి రోజు మనం కూడా కాలభైరవుని పూజిద్దాం సకల శుభాలను పొందుదాం. ఓం శ్రీ కాలభైరవ స్వామియే నమఃపరమ పూజ్య శ్రీ కాలభైరవ స్వామీజీ వారి శిష్య పరివారం ఆంధ్రప్రదేశ్.

Sunday, October 19, 2025

#కాలభైరవదీక్షఏలాతీసుకోవాలి? #కాలభైరవదీక్షఅంటేఏమిటి? #కాలభైరవదీక్షఎక్కడఇస్తారు? #కాలభైరవ దీక్ష ఎవరు ఇస్తారు? #కాలభైరవదీక్షాగురువుఎవరు? కాలభైరవాష్టమిఎప్పుడు? కాలభైరవజయంతి ఎప్పుడూ? 12 డిశంబర్ 2025 శుక్రవారం మార్గశిర బహుళ అష్టమి కాలభైరవాష్టమి, కాలభైరవ జయంతి*2025వ సంవత్సరంలో కాలభైరవ దీక్ష స్వీకరించుటకు తేదీలు*41రోజులు దీక్ష ది.26.10.2025 ఆదివారం స్వీకరించాలి..21రోజులు దీక్ష ది.16.11.2025 ఆదివారం స్వీకరించాలి.11రోజులు దీక్ష ది.30.11.2025 ఆదివారం స్వీకరించాలి.#కాలభైరవదీక్షరాజమండ్రిలోకాలభైరవ గురువుగారుఇస్తారు#కాలభైరవదీక్షాక్షేత్రం రాజమండ్రిలోఉన్నది #కాలభైరవదీక్ష ఇరుముడి రాజమండ్రిలో స్వర్ణాకర్షణ కాలభైరవ దేవాలయంలో ఇవ్వాలి.ఇరుముడి సమర్పణ 12.12.2025 శుక్రవారం కాలభైరవ జయంతి పర్వదినాన.. మాలా విరమణ, ఇరుముడి సమర్పణ, మహాపూర్ణాహుతి రాజమండ్రి శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి దేవాలయంలో జరుగును. ఉదయం 6 గంటలకు గురువు గారే స్వయంగా కాలభైరవ మంత్రంతో దీక్షను ఇస్తారు.దీక్ష తర్వాత ఇరుముడితో గురు సన్నిధికి చేరుకోవాలి.1. స్త్రీలు పిల్లలు అయితే 21రోజులు లేదా 11 రోజులు స్వీకరించాలి.2.ప్రాణ ప్రతిష్ట చేసిన రుద్రాక్షమాల, పెండెంట్ ధరించాలి. 3.నీలం రంగు వస్త్రాలు ధరించాలి. 4.ఉదయం, సాయంత్రం పంచోపచార పూజ (గంధం, పువ్వులు, అగరుబత్తి, దీపం, నైవేద్యం సమర్పణ) చేయాలి.5. ఖచ్చితంగా మంత్రం 10 మాలలు జపం చేయాలి.6.అందరినీ స్వామీ అని సంబోదించాలి. 7.బ్రహ్మచర్యం పాటించాలి. 8.కుటుంబం పోషణ కోసం చేసే పనులు ఉద్యోగం, వ్యాపారం అన్నీ సజావుగా నిర్వహిస్తూ.. 9.దీక్షాకాలం దృష్టి అంతా కాలభైరవ స్వామి వారి నామస్మరణ పైనే ఉంచాలి. 10.అనవసరంగా, అధికంగా ఎక్కువ మాట్లాడ కూడదు.. 11.ఇంట్లోనే పీఠం పెట్టుకుని పూజ చేయాలి.12.ధర్మ బద్ధమైన మార్గమున నడవాలి.. అబద్ధాలు ఆడడం, పుకాలను నమ్మడము, అసత్యాలను ప్రచారం, ఇతరులను నిందించడం చేయరాదు. ఇంకా వివరాలు కావాలంటే 9985551028 కు వాట్సాప్ చేయండి.

Friday, September 12, 2025

#2025సూర్యగ్రహణం ప్రభావం #21September2025సూర్యగ్రహణం#2025SuryaGrahanam #2025SolarEclipse #kalabhairavaguru #kalabhairavatv #rajahmundry #2025సూర్యగ్రహణం ఈ గ్రహణము ఏ రాశి వారికి, ఏ జన్మ నక్షత్రము వారికి పిల్లలకు పెద్దలకు ఎవ్వరికీ ఎటువంటి దుష్ప్రభావాన్ని, శాపాన్ని, దోషాన్ని ఇవ్వదు. భారతదేశంలో ఉన్నటువంటి వారు గ్రహ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. భారత కాలమానము ప్రకారము 21రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల 22 నిమిషాల వరకు ఈ గ్రహణం నడుస్తుంది ఈ సమయంలో మంత్ర ఉపదేశం ఉన్నవారు. మంత్రపురచ్చరణ మంత్రసిద్ధిలో భాగంగా గురుపరంపరలో ఉన్నవారు భగవత్ నామస్రనామాత్రం చేయవచ్చు. https://www.youtube.com/live/iew8LloEFGM?si=TjasLImirvdx_pG8కేవలం మంత్ర జపాన్ని మాత్రమే చేయండి. సెప్టెంబర్ 21న ఏర్పడనున్న పాక్షిక సూర్యగ్రహణంభారత్‌తో పాటు పొరుగు దేశాల్లోనూ కనిపించని ఖగోళ వింతన్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అంటార్కిటికాలో స్పష్టంగా వీక్షణ'ఈక్వినాక్స్ ఎక్లిప్స్'గా గుర్తింపుసూర్యుడిని పాక్షికంగా కప్పివేయనున్న చంద్రుడు. సెప్టెంబర్ 21న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ అద్భుతమైన ఖగోళ పరిణామం భారతదేశంలో కనిపించదు. ఈ గ్రహణం ప్రధానంగా దక్షిణార్ధగోళంలోని కొన్ని ప్రాంతాల వారికి మాత్రమే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రవేత్తలు ఈ గ్రహణానికి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు.ఎక్కడ, ఎప్పుడు కనిపిస్తుంది? #mantropadesham సెప్టెంబర్ 21న ఏర్పడే ఈ గ్రహణాన్ని పాక్షిక సూర్యగ్రహణం అని పిలుస్తారు. అంటే, చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేయకుండా కేవలం కొంత భాగాన్ని మాత్రమే అడ్డుకుంటాడు. దీనివల్ల ఆకాశంలో సూర్యుడు నెలవంక ఆకారంలో దర్శనమిస్తాడు.#anadanamseva ఈ సూర్యగ్రహణం భారత్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ వంటి పొరుగు దేశాల్లో కూడా కనిపించదు. ఇది ప్రధానంగా న్యూజిలాండ్, తూర్పు ఆస్ట్రేలియా, అంటార్కిటికా, దక్షిణ పసిఫిక్ ప్రాంతాల్లోని ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా, న్యూజిలాండ్‌లోని డ్యూనెడిన్ వంటి నగరాల్లో సూర్యుడు దాదాపు 72 శాతం వరకు చంద్రుడి చాటుకు వెళతాడని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.‘ఈక్వినాక్స్ ఎక్లిప్స్’గా ప్రత్యేక గుర్తింపుఈ గ్రహణానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది సెప్టెంబర్ 22న వచ్చే 'ఈక్వినాక్స్' కు సరిగ్గా ఒక రోజు ముందు ఏర్పడుతోంది. అందుకే శాస్త్రవేత్తలు దీనిని 'ఈక్వినాక్స్ ఎక్లిప్స్' అని కూడా పిలుస్తున్నారు. 'ఈక్వినాక్స్' రోజున సూర్యుడు భూమధ్యరేఖకు సరిగ్గా పైన ఉంటాడు. ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా పగలు, రాత్రి సమయాలు దాదాపు సమానంగా ఉంటాయి. ఉత్తరార్ధగోళంలో ఇది శరదృతువు ఆరంభానికి, దక్షిణార్ధగోళంలో వసంత రుతువు ఆరంభానికి సూచికగా నిలుస్తుంది. https://youtu.be/j60zd0EaGRU?si=7bvzZt6MrPVzDO3k