Saturday, October 25, 2025

#Kalabhairav Jayanthi 2025 #KalaBhairavashtami 2025 #కాలభైరవజయంతి2025 విశిష్టత ఏంటి? 12.12.2025 శుక్రవారం ఎలా పూజించాలి? సవివరంగా మీకోసం! #స్వర్ణాకర్షణభైరవదేవాలయం #పూజ్యశ్రీకాలభైరవస్వామిజీ జీవితంలో ఏదైనా సమస్తమైన కష్టాలను బాధలను దుఃఖాలను శత్రుభయాలను గ్రహభయాలను రోగభయం, ప్రతికూల శక్తులను తొలగించే కాలభైరవజయంతిపూజ. నాణాలను ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రం గా వర్ధిల్లుతున్న రాజమండ్రిలో ప్రత్యేకముగా కాలభైరవజయంతి పూజలు, కాలభైరవజయంతి హోమాలు, కాలభైరవ దీక్షలు, కాలభైరవ దీక్షా పూర్ణాహుతి, కాలభైరవ మాలా విరమణ, కాలభైరవ రథ యాత్రలు జరుగును. #KalabhairavaTV #kalabhairaguru Kalabhairav Jayanti Significance In Telugu : ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలంటారు. ఎంత సంపాదించినా మంచి ఆరోగ్యం లేకపొతే వృధానే! ఎన్ని మందులు వాడినా ఫలితం లేని మొండి రోగాల నుంచి విముక్తి పొందడానికి, ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించుకోడానికి కాలభైరవ జయంతి రోజు కాలభైరవుని పూజించాలని మహా మంత్రోపదేశకులు, అంతర్జాతీయ కాలభైరవ తత్వ ప్రచారకులు పరమపూజ్య శ్రీ కాలభైరవ స్వామీజీ వారు ఈ విధంగా వివరిస్తున్నారు. ఈ సందర్భంగా కాలభైరవ జయంతి ఎప్పుడు వచ్చింది? ఆ రోజు ఎలాంటి పూజలు చేయాలి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఎవరీ కాలభైరవుడు?సాక్షాత్తు పరమశివుడే కాలభైరవుడు. వ్యాస మహర్షి రచించిన శివ మహా పురాణం ప్రకారం ఒకానొక సందర్భంలో బ్రహ్మ, విష్ణువు మధ్య విశ్వాన్ని ఎవరు కాపాడుతున్నారు? పరతత్వం ఎవరు? అనే అంశం చర్చకు దారి తీసింది. ఈ వివాదాంశం గురించి మహర్షులు 'సమస్త విశ్వానికి మూలమైన పరతత్వం ఒక్క మాటలో తేల్చి చెప్పడానికి వీలు కానిది. ఇందుకు కారణం విష్ణువు బ్రహ్మ ఇద్దరూ ఆ శక్తి విభూతి నుంచి ఏర్పడిన వారే కదా!' అన్నారు ఋషులు. ఈ విషయానికి సంబంధించి బ్రహ్మ దేవుడు, విష్ణువు దేవతలందరితో పాటుగా శివుడిని సంప్రదించారు. ఆ సమయంలో దేవతలందరూ ఒకచోట కూర్చుని ఆ పరమేశ్వరుడే సృష్టికి మూలమని తేల్చారు. అయితే బ్రహ్మదేవుడు దీనిని అంగీకరించకుండా శివుని దూషించాడు. అప్పుడు శివుడు, బ్రహ్మ అహంకార గర్వ భంగం కోసం తన అంశ నుండి కాలభైరవ అవతారము ఆవిర్భవించింది. ఈ బైరవ అవతారానికి కారణమైన రోజు మార్గశిర బహుళ అష్టమి కావడం వల్ల ఆ రోజు "కాలభైరవాష్టమి" గా "కాలభైరవ జయంతి" గా, ప్రసిద్ధి చెందింది.కాలభైరవాష్టమి ఎప్పుడు? ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో బహుళ పక్షంలో అష్టమి తిథి నాడు కాల భైరవ జయంతిని జరుపుకుంటారు. ఈ సందర్భంగా డిసెంబర్ 12వ తేదీ శుక్రవారం రోజు కాలభైరవ జయంతి జరుపుకోవాలని పరమ పూజ శ్రీ కాలభైరవ స్వామీజీ వారు సూచిస్తున్నారు. సాధారణంగా కాలభైరవ పూజ రాత్రి సమయాలలో గురు మంత్రాలను, జపం, హోమం నిర్వహిస్తారు. రాజమండ్రిలో ఈ కాలభైరవ జయంతి పర్వదినాన మరియు ప్రతి ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు దర్శనం ఉంటుంది. కాలభైరవ స్వరూపంపరమశివుని స్వరూపమైన కాలభైరవుడు ఉగ్రరూపంతో ఉంటాడు. కాలభైరవుని వాహనం శునకం. అంతేకాదు పరమ పావనమైన కాశీ క్షేత్ర పాలకుడు కూడా కాల భైరవుడు. అందుకే వారణాశి వెళ్లిన వారు కాలభైరవుని కూడా తప్పకుండ ధూల్ దర్శనం చేసుకుంటారు. దక్షిణ భారతదేశంలో ఉన్నవారు తప్పనిసరిగా గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరంలో ఉన్న శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి దర్శనం చేసుకుని గారెల దండలు, నీలి శంకు పూలదండలు, కార్యసిద్ధి కాలభైరవ దీపాలు సమర్పణ చేస్తారు.కాలభైరవాష్టమి విశిష్టతకాలభైరవాష్టమి రోజున కాలభైరవుడిని పూజించడం ద్వారా రోగ భయం, మృత్యు భయం నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం. విశేషించి ఈ రోజున కాలభైరవుడిని పూజించిన వారికి అన్ని రకాల వ్యాధుల నుంచి, దుష్టశక్తుల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. అలాగే ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయని, కాల భైరవుని మంత్రం పఠించడం వల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయని స్వామీజీ తెలియజేస్తున్నారుకాలభైరవాష్టమి పూజావిధానంకాల భైరవుని జయంతి రోజున కాల భైరవుడితో పాటు కాళీమాతను పూజించాలి. అష్టమి కి ముందు సప్తమి తిథి రోజున అర్ధరాత్రి కాళరాత్రి దేవిని పూజిస్తారు. ఈ తర్వాతే కాలభైరవుడిని పూజిస్తారు. కాలాష్టమి తిథి కాలంలో పరమేశ్వరుడిని కూడా పూజించడం పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున పూజలు చేసే వారు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్న భక్తులు రాత్రి జాగరణ కూడా చేయాలి. ఉపవాసం ఉండే వారు రాత్రి వేళ ఉపవాసాన్ని విరమించి పండ్లు, పాలు మాత్రమే తీసుకోవాలి. ఆ మరుసటి రోజే తిరిగి కాలభైరవుని దర్శించిన తర్వాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి.కాలభైరవ పూజాఫలంకాలభైరవాష్టమి రోజు కాలభైరవుని పూజించడం ద్వారా శత్రుభయం, అపమృత్యు భయం, రోగభయం తొలగిపోతాయని విశ్వాసం. అలాగే తరచుగా పనులలో ఆటంకాలు ఎదురవుతుంటే కాలభైరవాష్టమి రోజు కాలభైరవుని భక్తిశ్రద్ధలతో పూజిస్తే ప్రతికూల శక్తులు తొలగి పనుల్లో సానుకూలత ఉంటుందని విశ్వాసం. అలాగే ఈ రోజు కాలభైరవుని వాహనమైన నల్ల కుక్కకు కుంకుమతో బొట్టు పెట్టి, గారెలతో తయారు చేసిన మాల వేయడం వలన సమస్త గ్రహ దోషాలు పోతాయని విశ్వాసం. రానున్న కాలభైరవాష్టమి రోజు మనం కూడా కాలభైరవుని పూజిద్దాం సకల శుభాలను పొందుదాం. ఓం శ్రీ కాలభైరవ స్వామియే నమఃపరమ పూజ్య శ్రీ కాలభైరవ స్వామీజీ వారి శిష్య పరివారం ఆంధ్రప్రదేశ్.

Sunday, October 19, 2025

#కాలభైరవదీక్షఏలాతీసుకోవాలి? #కాలభైరవదీక్షఅంటేఏమిటి? #కాలభైరవదీక్షఎక్కడఇస్తారు? #కాలభైరవ దీక్ష ఎవరు ఇస్తారు? #కాలభైరవదీక్షాగురువుఎవరు? కాలభైరవాష్టమిఎప్పుడు? కాలభైరవజయంతి ఎప్పుడూ? 12 డిశంబర్ 2025 శుక్రవారం మార్గశిర బహుళ అష్టమి కాలభైరవాష్టమి, కాలభైరవ జయంతి*2025వ సంవత్సరంలో కాలభైరవ దీక్ష స్వీకరించుటకు తేదీలు*41రోజులు దీక్ష ది.26.10.2025 ఆదివారం స్వీకరించాలి..21రోజులు దీక్ష ది.16.11.2025 ఆదివారం స్వీకరించాలి.11రోజులు దీక్ష ది.30.11.2025 ఆదివారం స్వీకరించాలి.#కాలభైరవదీక్షరాజమండ్రిలోకాలభైరవ గురువుగారుఇస్తారు#కాలభైరవదీక్షాక్షేత్రం రాజమండ్రిలోఉన్నది #కాలభైరవదీక్ష ఇరుముడి రాజమండ్రిలో స్వర్ణాకర్షణ కాలభైరవ దేవాలయంలో ఇవ్వాలి.ఇరుముడి సమర్పణ 12.12.2025 శుక్రవారం కాలభైరవ జయంతి పర్వదినాన.. మాలా విరమణ, ఇరుముడి సమర్పణ, మహాపూర్ణాహుతి రాజమండ్రి శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి దేవాలయంలో జరుగును. ఉదయం 6 గంటలకు గురువు గారే స్వయంగా కాలభైరవ మంత్రంతో దీక్షను ఇస్తారు.దీక్ష తర్వాత ఇరుముడితో గురు సన్నిధికి చేరుకోవాలి.1. స్త్రీలు పిల్లలు అయితే 21రోజులు లేదా 11 రోజులు స్వీకరించాలి.2.ప్రాణ ప్రతిష్ట చేసిన రుద్రాక్షమాల, పెండెంట్ ధరించాలి. 3.నీలం రంగు వస్త్రాలు ధరించాలి. 4.ఉదయం, సాయంత్రం పంచోపచార పూజ (గంధం, పువ్వులు, అగరుబత్తి, దీపం, నైవేద్యం సమర్పణ) చేయాలి.5. ఖచ్చితంగా మంత్రం 10 మాలలు జపం చేయాలి.6.అందరినీ స్వామీ అని సంబోదించాలి. 7.బ్రహ్మచర్యం పాటించాలి. 8.కుటుంబం పోషణ కోసం చేసే పనులు ఉద్యోగం, వ్యాపారం అన్నీ సజావుగా నిర్వహిస్తూ.. 9.దీక్షాకాలం దృష్టి అంతా కాలభైరవ స్వామి వారి నామస్మరణ పైనే ఉంచాలి. 10.అనవసరంగా, అధికంగా ఎక్కువ మాట్లాడ కూడదు.. 11.ఇంట్లోనే పీఠం పెట్టుకుని పూజ చేయాలి.12.ధర్మ బద్ధమైన మార్గమున నడవాలి.. అబద్ధాలు ఆడడం, పుకాలను నమ్మడము, అసత్యాలను ప్రచారం, ఇతరులను నిందించడం చేయరాదు. ఇంకా వివరాలు కావాలంటే 9985551028 కు వాట్సాప్ చేయండి.