Monday, March 29, 2021

#ఆయురారోగ్యాలు_అష్టైశ్వర్యాలుఅనుగ్రహించే_శ్రీస్వర్ణాకర్షణభైరవస్వామి మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి . మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి , ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో,ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు. http://www.facebook.com/kalabhairavaTV " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం కలిగుతుందని మా ఆశ. అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " మన లక్ష్యం.... స్వర్ణాకర్షణ కాలభైరవ చిత్రపటం శని దోషం ఉన్నవారు, శని దశ, ఏల్నాటి శని ఉన్నవారు, పనులు ఆటంకాలు కలుగుతున్నవారు, శని సంబంధ వృత్తి, ఉద్యోగాలలో రాణించాలనుకునేవారు, ధనాభివృద్ధి కొరకు పూజా మందిరంలో ప్రతిష్టించుకొని పూజించు వారికి ధనాభివృద్ధితో పటు, శని బాధల నుండి విముక్తి కలుగుతుంది. పిల్లలకు చదువులో శ్రద్ధ తగ్గుతున్న, దీర్ఘకాల అనారోగ్యాలతో బాధపడుతున్నవారు, దీర్ఘకాల సమస్యలు ఉన్నవారు కాలభైరవ రూపు ధరించటం మంచిది. శ్రీస్వర్ణాకర్షణభైరవస్వామి వారు కొలువు తీరిన క్షేత్రం అఖండ గోదావరి నదీ తీరం రాజమహేంద్రవరం ఆం. ప్ర. ప్రతీ ఆదివారం అష్టమి అమావాశ్య పౌర్ణమి రోజుల్లో ఉదయం 7.30 నుండి ఉదయం11.45 వరకు మాత్రమే దర్శనం ఉంటుంది.. ఇక్కడ డబ్బులను నాణాలను ప్రసాదంగా ఇవ్వడం ఒక ఆచారం... మరిన్ని వివరాల కోసం కాలభైరవటివి చూడగలరు.." స్వర్ణవర్ణం చతుర్బాహుం త్రినేత్రం పీతవాససం స్వర్ణ పాత్రధరం వందే స్వర్ణాకర్షణ భైరవం "పరమేశ్వరుని మరొక రూపమే శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వరూపం చూడడానికి ఎర్రటి చాయతో ప్రకాశిస్తూ ఉంటారు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు. తలపై చంద్రుడిని ధరించి. చతుర్భుజాలతో. ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది. స్వర్ణాకర్షణ భైరవుడు సిరి సంపదలు ఇస్తాడని చెబుతారు. కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం ఫ్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ! అని శివరాత్రికి మనవూళ్ళో గుళ్ళో పాటతో కాలభైరవుడి పరిచయం అవుతుంది. కాలభైరవుడు వారణాసికి క్షేత్రపాలకుడుగా కీర్తించబడ్డాడు. మంత్ర తంత్ర సాధనల్లో ఏం సాధించాలన్నా ముందు ఆయన అనుమతి తీసుకుంటారు. సాక్షాత్తూ శివుడే కాలభైరవుడై సంచరించాడని శాస్త్రాలు చెపుతున్నాయి. అనేక దేవాలయాల్లో కాలభైరవ విగ్రహం వుంటుంది, ఆయన క్షేత్రపాలకుడిగా, గ్రామ నగర రక్షకుడిగా, మంత్ర సిద్ది ప్రదాత గా, తంత్ర మూర్తిగా మనకి తెలుసు. కాలమే జగన్మూలం. ఆ కాలరూపుడే కాలభైరవుడు. కాలాన్ని జయించడం సాధ్యం కాకున్నా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. గ్రహబలాలని అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవోపాసనతో సాధ్యం. కాలభైరవుడ్ని నేపాల్ ప్రాంతాల్లో, హిమాలయాల్లో ఎంతగానో పూజిస్తారు. ఖాట్మండు నగర మధ్యంలో వున్న కాలభైరవ మూర్తి చాలా దశాబ్దాలు నేపాల్ సుప్రీం కోర్టుగా పరిగణించబడేది. ఆ విగ్రహం ముందు ఎవరైన అబద్దం చెపితే సజీవులై వుండలేరని నమ్మకం. ఆధునికయుగంలోనూ కొన్ని కొన్ని విశేషాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆయన పేరుకి తగ్గట్టు ధన సమృద్ధిని, ఋణ విముక్తిని ఇస్తాడు. అన్నిటికన్న ముఖ్యం జ్ఞాన వైరాగ్యాలకి ఆయనే అత్యంత సన్నిహితుడు, కారకుడు. కాలభైరవుని స్తోత్రాలు, మంత్రాలూ, ఎన్నో ఉన్నాయి, ఏ స్తోత్రం పఠించినా అద్భుతమైన ఫలితాలు, కాలభైరవుని అనుగ్రహము కలుగుతుంది. అటువంటి స్తోత్రాలలో మరొక మహామహిమాన్వితమైన స్తోత్రంస్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం.ఓం అస్య శ్రీ స్వర్ణాఽకర్షణ భైరవ స్తోత్ర మహామంత్రస్య బ్రహ్మ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ స్వర్ణాకర్షణ భైరవో దేవతా హ్రీం బీజం క్లీం శక్తిః సః కీలకం మమ దారిద్ర్య నాశార్థే పాఠే వినియొగః || ఋష్యాది న్యాసః | బ్రహ్మర్షయే నమః శిరసి | అనుష్టుప్ ఛందసే నమః ముఖే | స్వర్ణాకర్షణ భైరవాయ నమః హృది | హ్రీం బీజాయ నమః గుహ్యే | క్లీం శక్తయే నమః పాదయోః | సః కీలకాయ నమః నాభౌ | వినియొగాయ నమః సర్వాంగే | హ్రాం హ్రీం హ్రూం ఇతి కర షడంగన్యాసః || ధ్యానం | పారిజాతద్రుమ కాంతారే స్థితే మాణిక్య మండపే సింహాసన గతం వందే భైరవం స్వర్ణదాయకం | గాంగేయ పాత్రం డమరూం త్రిశూలం వరం కరః సందధతం త్రినేత్రం దేవ్యాయుతం తప్త స్వర్ణవర్ణ స్వర్ణాకర్షణ భైరవమాశ్రయామి || మంత్రః | ఓం ఐం హ్రీం శ్రీం ఐం శ్రీం ఆపదుద్ధారణాయ హ్రాం హ్రీం హ్రూం అజామలవధ్యాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమ దారిద్ర్య విద్వేషణాయ మహాభైరవాయ నమః శ్రీం హ్రీం ఐం | స్తోత్రం | ఓం నమస్తే భైరవాయ బ్రహ్మ విష్ణు శివాత్మనే| నమః త్రైలోక్య వంద్యాయ వరదాయ వరాత్మనే || ౧ || రత్నసింహాసనస్థాయ దివ్యాభరణ శోభినే | దివ్యమాల్య విభూషాయ నమస్తే దివ్యమూర్తయే || ౨ || నమస్తే అనేక హస్తాయ అనేక శిరసే నమః | నమస్తే అనేక నేత్రాయ అనేక విభవే నమః || ౩ || నమస్తే అనేక కంఠాయ అనేకాంశాయ తే నమః | నమస్తే అనేక పార్శ్వాయ నమస్తే దివ్య తేజసే || ౪ || అనేకాఽయుధయుక్తాయ అనేక సురసేవినే | అనేక గుణయుక్తాయ మహాదేవాయ తే నమః || ౫ || నమో దారిద్ర్యకాలాయ మహాసంపత్ప్రదాయినే | శ్రీ భైరవీ సంయుక్తాయ త్రిలోకేశాయ తే నమః || ౬ || దిగంబర నమస్తుభ్యం దివ్యాంగాయ నమో నమః | నమోఽస్తు దైత్యకాలాయ పాపకాలాయ తే నమః || ౭ || సర్వజ్ఞాయ నమస్తుభ్యం నమస్తే దివ్య చక్షుషే | అజితాయ నమస్తుభ్యం జితమిత్రాయ తే నమః || ౮ || నమస్తే రుద్రరూపాయ మహావీరాయ తే నమః | నమోఽస్త్వనంత వీర్యాయ మహాఘోరాయ తే నమః || ౯ || నమస్తే ఘోర ఘోరాయ విశ్వఘోరాయ తే నమః | నమః ఉగ్రాయ శాంతాయ భక్తానాం శాంతిదాయినే || ౧౦ || గురవే సర్వలోకానాం నమః ప్రణవ రూపిణే | నమస్తే వాగ్భవాఖ్యాయ దీర్ఘకామాయ తే నమః || ౧౧ || నమస్తే కామరాజాయ యొషిత కామాయ తే నమః | దీర్ఘమాయాస్వరూపాయ మహామాయాయ తే నమః || ౧౨ || సృష్టిమాయా స్వరూపాయ నిసర్గ సమయాయ తే | సురలోక సుపూజ్యాయ ఆపదుద్ధారణాయ చ || ౧౩ || నమో నమో భైరవాయ మహాదారిద్ర్యనాశినే | ఉన్మూలనే కర్మఠాయ అలక్ష్మ్యాః సర్వదా నమః || ౧౪ || నమో అజామలవధ్యాయ నమో లోకేష్వరాయ తే | స్వర్ణాఽకర్షణ శీలాయ భైరవాయ నమో నమః || ౧౫ || మమ దారిద్ర్య విద్వేషణాయ లక్ష్యాయ తే నమః | నమో లోకత్రయేశాయ స్వానంద నిహితాయ తే || ౧౬ || నమః శ్రీ బీజరూపాయ సర్వకామప్రదాయినే | నమో మహాభైరవాయ శ్రీ భైరవ నమో నమః || ౧౭ || ధనాధ్యక్ష నమస్తుభ్యం శరణ్యాయ నమో నమః | నమః ప్రసన్న (రూపాయ) ఆదిదేవాయ తే నమః || ౧౮ || నమస్తే మంత్రరూపాయ నమస్తే మంత్రరూపిణే | నమస్తే స్వర్ణరూపాయ సువర్ణాయ నమో నమః || ౧౯ || నమః సువర్ణవర్ణాయ మహాపుణ్యాయ తే నమః | నమః శుద్ధాయ బుద్ధాయ నమః సంసార తారిణే || ౨౦ || నమో దేవాయ గుహ్యాయ ప్రచలాయ నమో నమః | నమస్తే బాలరూపాయ పరేషాం బలనాశినే || ౨౧ || నమస్తే స్వర్ణసంస్థాయ నమో భూతలవాసినే | నమః పాతాళవాసాయ అనాధారాయ తే నమః || ౨౨ || నమో నమస్తే శాంతాయ అనంతాయ నమో నమః | ద్విభుజాయ నమస్తుభ్యం భుజత్రయ సుశోభినే || ౨౩ || నమోఽణిమాది సిద్ధాయ స్వర్ణహస్తాయ తే నమః | పూర్ణచంద్ర ప్రతీకాశ వదనాంభోజ శోభినే || ౨౪ || నమస్తేఽస్తు స్వరూపాయ స్వర్ణాలంకార శోభినే | నమః స్వర్ణాఽకర్షణాయ స్వర్ణాభాయ నమో నమః || ౨౫ || నమస్తే స్వర్ణకంఠాయ స్వర్ణాభ అంబరధారిణే | స్వర్ణసింహాసనస్థాయ స్వర్ణపాదాయ తే నమః || ౨౬ || నమః స్వర్ణాభపాదాయ స్వర్ణకాంచీ సుశోభినే | నమస్తే స్వర్ణజంఘాయ భక్తకామదుధాత్మనే || ౨౭ || నమస్తే స్వర్ణభక్తాయ కల్పవృక్ష స్వరూపిణే | చింతామణి స్వరూపాయ నమో బ్రహ్మాది సేవినే || ౨౮ || కల్పద్రుమాద్యః సంస్థాయ బహుస్వర్ణ ప్రదాయినే | నమో హేమాకర్షణాయ భైరవాయ నమో నమః || ౨౯ || స్తవేనానేన సంతుష్టో భవ లోకేశ భైరవ | పశ్య మాం కరుణాద్రుష్ట్యా శరణాగతవత్సల || ౩౦ || శ్రీ మహాభైరవస్య ఇదం స్తోత్రముక్తం సుదుర్లభం | మంత్రాత్మకం మహాపుణ్యం సర్వైశ్వర్యప్రదాయకం || ౩౧ || యః పఠేన్నిత్యం ఏకాగ్రం పాతకై స ప్రముచ్యతే | లభతే మహతీం లక్ష్మీం అష్టైశ్వర్యం అవాప్నుయాత్ || ౩౨ || చింతామణిం అవాప్నోతి ధేను కల్పతరుం ధృవం | స్వర్ణరాశిం అవాప్నోతి శీఘ్రమేవ న సంశయః || ౩౩ || త్రిసంధ్యం యః పఠేత్ స్తోత్రం దశావృత్యా నరోత్తమః | స్వప్నే శ్రీ భైరవః తస్య సాక్షాత్ భూత్వా జగద్గురుః || ౩౪ || స్వర్ణరాశి దదాత్యస్యై తత్‍క్షణం నాత్ర సంశయః | అష్టావృత్యా పఠేత్ యస్తు సంధ్యాయాం వా నరోత్తమం || ౩౫ || లభతే సకలాన్ కామాన్ సప్తాహాన్ నాత్ర సంశయః | సర్వదా యః పఠేత్ స్తోత్రం భైరవస్య మహాత్మనాః || ౩౬ || లోకత్రయం వశీకుర్యాత్ అచలాం లక్ష్మీం అవాప్నుయాత్ | న భయం విద్యతే క్వాపి విషభూతాది సంభవం || ౩౭ || మ్రియతే శత్రవః తస్య అలక్ష్మీ నాశం ఆప్నుయాత్ | అక్షయం లభతే సౌఖ్యం సర్వదా మానవోత్తమః || ౩౮ || అష్ట పంచాత్వర్ణాద్యో మంత్రరాజః ప్రకీర్తితః | దారిద్ర్య దుఃఖశమనః స్వర్ణాకర్షణ కారకః || ౩౯ || య ఏన సంచయేత్ ధీమాన్ స్తోత్రం వా ప్రపఠేత్ సదా | మహాభైరవ సాయుజ్యం స అనంతకాలే లభేత్ ధృవం || ౪౦ ||ఇతి రుద్రయామల తంత్రే స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం సంపూర్ణం ||అందరికీ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండిఅందరం భక్తితో " ఓం శ్రీ కాలభైరవాయ నమః " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ... ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ భగవంతుడు

Monday, March 22, 2021

#LordSwarnakarshanaBhairavaSwamy విశాఖపట్నం లో ఒక భక్తుడు వారి ఇంటిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న స్వర్ణ భైరవ స్వామి వారి చిత్రపటం... నిత్యం కుటుంబసమేతంగా స్వర్ణ భైరవ మంత్రం 5మాలలు జపిస్తూ.. రోజూ పిడికెడు బియ్యం పక్కన వేస్తున్నారు... అమావాశ్య రోజున అన్నప్రసాద వితరణకు... మీరు చెయవచ్చు

World famous Swarnakarshana KalaBhairava Swamy temple Rajahmundry Andhra Pradesh India

#Money Giving KalaBhairava Swamy temple #kalabhairavaswamytemple #సర్పహరతిసమర్పిస్తున్నగురూజీరాజమండ్రి క్షేత్రపాలక కాలభైరవ స్వామి వారికి సర్పహారతి సమర్పిస్తున్న కాలభైరవగురూజీ..

Useful KalaBhairava Swamy Mantra Telugu

Kalabhairava Swamy Annadanam Seva

kalabhairava Swamy Annadanam Seva Rajahmundry

రాజమండ్రి క్షేత్రపాలక కాలభైరవ స్వామి వారికి దూప హారతి సమర్పిస్తున్న కాలభైరవ గురూజీ.. KalaBhairava Swamy Harathi Darshan Rajahmundry KalaBhairava temple

Wednesday, March 17, 2021

#KalaBhairavaSwamy అంటే యదార్ధం, నిజం, సత్యం, ధర్మం... ఈశ్వరుని రుద్ర స్వరూపం, జగద్రక్షకుడు, దిగంబరుడు, క్షేత్రపాలకుడు, కాలస్వరూపుడు, కాలాతీతుడు, కాలరాజు, పాపభక్షుడు, దండనాధుడు, భక్తులెవరైన డౌన్లోడ్ చేసుకోవచ్చు....

#KalaBhairavaDasaNamaRakshaaStrotram#కాలభైరవగురుసంస్థాన్_మఠంభయం బాధలు అశాంతి అభద్రతా భావం కలి ప్రభావం తొలగుటకు....కలి ఇంట్లో ప్రవేశించకుండా ఉండడానికి ప్రతీ రోజూ శుభం కలుగుటకు ఈశ్లోకాన్ని రోజూ నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఉదయం సాయంత్రం 21 సార్లుచదువు కొండి, మీ పిల్లలకు నేర్పించండి.. శుభమ్ కలుగుతుందివీలయితే ఒక బోర్డ్ పై పెద్ద అక్షరాలతో వ్రాసి ఇంట్లో వ్రేలాడదీయండిశ్లోకం!!ఓం కపాలి, కుండలీ, భీమో, భైరవో, భీమవిక్రమః, వ్యాలోపవీతీ, కవచీ, శూలీ, శూరః, శివప్రియః !!