Thursday, December 24, 2020

How to Remove Shani Dosha and All Negetive Problems. #ఎవరోమీకుదోషాలుఉన్నాయిఅని శాంతులు చేయాలని దానికి ఇంత సొమ్ము అవుతుందని చెపితే అవి నమ్మి మోసపోవద్దు...డబ్బులు వృదా చేసుకోవద్దు.. మన ధర్మంపై నమ్మకాన్ని కోల్పోవద్దు.. అన్ని సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసుకోవచ్చు.. సంకల్పబలంతో, భగవత్ నామస్మరణతోపెళ్లి..ఉద్యోగం..వ్యాపారం.. సంతానం..ధనం నిలకడ లేకపోవడం.... నరదృష్టి......నాగదోషం.... కాలసర్ప దోషం, కుజ దోషం,శనిదోషం.... నవగ్రహ దోషాలు, వంటి సమస్యలు,చదువులో ముందుకు రాలేక పోవడం, ఉద్యోగం నిలకడ లేక పోవడం, పర స్త్రీ, పర పురుషుల వ్యామోహాలు. పెళ్లి ఆలస్యం కావటం, భార్యాభర్తల మధ్య తగాదాలు రావడం, సంతాన ప్రాప్తి సమయానికి లేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, కోర్టు సమస్యలు అధికం కావడం, సినిమా ప్రయత్నాలు విఫలం కావడం , రాజకీయాలలో ఎదుగుదల లేకపోవడం , గొప్ప క్రీడాకారుడు కావాలని విఫలమవటం ఇంకా ఎటువంటి సమస్యకైనా శాశ్వతమైన పరిష్కార మార్గం... 1రోజూ లేచిన వెంటనే భూమాతకు నమస్కారం చేయండి. మీకు ఏమి అభీష్టామో సంకల్పించి కొని కాలభైరవ దశనామరక్షా స్తోత్రము11 మార్లు పఠించండి.2. మీ పని అంటే మీఉద్యోగం, మీ వ్యాపారం, కుటుంబ పోషణ కోసం మీరు చేసే పని పై మరింత శ్రద్ధను పెట్టండి. 3. పాజిటివ్ గా ఉండండి. 4. మిమ్మల్ని మీరు గౌరవించుకొండి. 5. మీ అమ్మ నాన్న భార్య భర్త పిల్లలను మీ ఇరుగుపొరుగు వారి ని అందరినీ ప్రేమించండి.. వారిలో మంచిని చూడండి.. 6. అనుక్షణం దేవుణ్ణి స్మరించండి.. 7. రోజూ కనీసం ఒక రూపాయి అయినా దానం చేయండి. ఆహార రూపంగా ఏ జీవికైనా సరే.. 8.కాలభైరవ సహస్ర నామ స్తోత్రం రోజు ఒక సారి పారాయణ చేయండి మీ ఇంటి వద్ద రోజు ఒక గుప్పెడు బియ్యం తీసి పక్కన వేయండి.. నెలకు ఒకసారి వాటిని చిత్రాన్నము చేసి అందరికి పంచండి. 9. అనవసరంగా ఎవ్వరితోనూ ఎక్కువ మాట్లాడవద్దు.. 10.అమావాస్య రోజు కాలచక్ర దీప పూజ మౌన వ్రత దీక్ష.

No comments:

Post a Comment