Thursday, April 15, 2021

#కర్కాటకరాశివారికి2021 - 2022 శ్రీ ప్లవ నామ ఉగాది వార్షిక ఫలితాలు #KalabhairavaTV పునర్వసు నక్షత్ర 4 వ పాదాల వారు, పుష్యమి నక్షత్ర 1,2,3,4 పాదములవారు, ఆశ్లేష నక్షత్ర 1,2,3,4 వ పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుదురు.శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కర్కాటకరాశి వారికిఆదాయం 14, వ్యయం - 02,రాజ పూజ్యం - 06, అవమానం - 06🟡గురువు :- ఉగాది ప్రారంభం నుండి సెప్టెంబర్ 14 వరకు అష్టమ స్థానమైన ( కుంభం) లో తామ్రమూర్తిగా .. తర్వాత నవంబర్ 20 వరకు సప్తమంలో రజితమూర్తి.. ఆ తర్వాత సంవత్సరం అంతా అష్టమంలో సువర్ణ మూర్తిగా ఉంటాడు.🔵శని :- సంవత్సరమంతా ... సప్తమ స్థానమైన ( మకరరాశి )లో తామ్ర మూర్తిగా ఉంటాడు.⚫రాహు 🟣కేతువులు :- సంవత్సరమంతా 11 , 5 ( వృషభ, వృశ్చిక ) రాశులలో రజిత మూర్తులుగా ఉంటారు.గురువు ఉగాది నుండి ఆశుభుడు కాబట్టి సంవత్సరమంతా అనుకూల ఫలితాలను ఇవ్వడు.#kalabhairavagurugantalapanchangam గత శార్వరి నామ సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా వలన కొన్ని ఇబ్బందులతో కొనసాగును.ముఖ్యంగా గురువు నవంబర్ 20 నుంచి తీవ్రమైన ఆర్ధిక సమస్యలు కలుగజేయును .స్వార్జితం మరియు పిత్రార్జిత ధన సంపదలు రెండూ ఖర్చు అవుతాయి .వ్యక్తిగత జాతకంలో గురువు నీచ క్షేత్రలో కానీ లేదా శత్రు స్థానాలలో ఉంటే గురువు శని రాహు కేతు అనుగ్రహం కోసం కాలభైరవ దర్శనం చేసుకొని నల్లమినపప్పు 19గారెల దండ, 19నిమ్మకాయల దండ సమర్పించండి మంచిది.గృహంలో ఎండుకొబ్బరి లో దీపం వెలిగించి అష్ట భైరవ మంత్రం చదవండి.. #KalaBhairavaGuru#కాలభైరవగురుగంటలపంచాంగం33రకాల శక్తివంతమైన జాతక జీవిత పరిహార సూచనలతో అన్ని పుస్తక పూజా సంబంధ దుకాణాల్లో అందుబాటులో ఉన్నది...http://www.facebook.com/kalabhairavaTVసర్వేజనా: సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి: చేయించాలి.* శని వలన ఉద్యోగ జీవనంలో కొద్దిపాటి ఉన్నతి లభించును.కష్టం మీద పదోన్నతి మరియు ప్రయత్నాలలో విజయం పొందుతారు .జాతకంలో శని వలన కళత్ర దోషం ఏర్పడిన వారు వివాహ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొందురు.విశేషించి అనారోగ్య సమస్యలు ఏర్పడు సూచనలు ఎక్కువగా ఉన్నాయి.ఆరోగ్య పరమైన విషయాలలో ఎంత మాత్రం అశ్రద్ద పనికిరాదు.* రాహువు - కేతువులు ఇద్దరూ అనుకూలమైన శుభ ఫలితాలను ఇస్తారు .ఆర్ధిక అంశాలలో ఏమైనా మిగులు ధన లాభం ఉన్నదంటే అది రాహు - కేతువుల వలననే ఏర్పడును.ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి విజయం ఏర్పరచును.సంతాన ప్రయత్నాలు చేయు వారికి చక్కటి సంతాన సౌఖ్యం ఏర్పరచును.* ( ఇతర అన్ని గ్రహ స్థానాలను ఆధారంగా ఫలితాలు ఇలా ఉండనున్నాయి. )వృత్తి వ్యాపారాలలో కుటుంబ వ్యవహారములలో విజయాన్ని సూచించుచున్నది.* అవివాహితులకు వివాహ యోగం.ప్రేమ విషయంలో మోసపోవడం.. ధనం నష్టం జరుగు తుంది... సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగును.వ్యక్తిగత జాతకాల ఆధారంగా భార్యాభర్తలకు సంబంధించి కొందరి విషయాలలో దూరం అవడం కానీ లేదా విడిపోవడం కానీ శాశ్వతంగా దూరం అవ్వడం కాని జరిగే ఆస్కారం ఉంది. ( ఇది అందరికీ వర్తించదు. )రాజకీయ రంగాలలో రానిస్తారు. కానీ సెప్టెంబర్ వరకు స్వంత పార్టీ వారితోనే ఇబ్బందులు వస్తాయి.మీ వెనుక ఉన్నవారే మిమ్మల్ని క్రిందకు దిగి పోయేలా చేస్తారు... అనుమాాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం...జీవితంలో కొంత మంది దూరం అవుతారు.వ్యాపారం పరంగా వచ్చిన ఒక అవకాశాన్ని సద్వినియోగ పరచుకుంటారు.కుటుంబంలో అందరితో కలిసి ఉన్ననూ .. మీరు ఒంటరివారేనన్న భావన కల్గుతుంది .విద్యాకు సంబందించి విదేశీయాన సంబంధ విషయాలు అనుకూలిస్తాయి.ఈతలకు ( స్విమ్మింగ్ ) లకు దూరంగా ఉండాలి, జల గండ సూచనలున్నాయి.వ్యవసాయ దారులకు మొదటి పంట అనుకూలంగా వస్తుంది. రెండవ పంట ఆశించినంత రాకపోవచ్చును.ఉద్యోగస్తులకు ఇష్టం లేని బదిలీలు ఉంటాయి.తోటి ఉద్యోగులతో విరోధాలు ఏర్పడే సూచనలున్నాయి.ప్రేమ వ్యవహారాలు వల్ల దారుణమైన నష్టం.. అక్రమ సంబంధాలు వల్ల కీర్తి ప్రతిష్టలకు భంగం.. కేసులు... కోర్టు గొడవల్లో ఇరుక్కోవడం.. మరణ భయం...పై అధికారులతో సఖ్యత ఉండదు.అవకాశం చేసుకుని చండీ మూల మంత్రం జపిస్తూ ఉంటే మంచిది.అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు లక్ష్మీ కుబేర స్వర్ణ ఆకర్షణ మంత్రం రోజూ 3 మాలలు జపించంది. బహుళ అష్టమి నాడు గృహంలో Swarnakarshana Bhairava Swamy Vratam మంచి జరుగుతుంది.సర్వేజనా: సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి:

No comments:

Post a Comment