Thursday, May 20, 2021

#KaalaBhairavaGuru#ఇదేవిధి..! విధిని ఎవ్వరూ మార్చలేరు. మన కర్మను బట్టి జీవితం ఉంటుంది.ఈ భూమి పై ఈశరీరంతో ఏమేమి చేయాల్సి ఉందో అది మాత్రమే చేయగలం. ఏదైనా మన కర్మ ప్రకారం చేయాల్సి ఉంటే అది పూర్తి అయ్యేవరకు మృత్యువు కూడా దరిదాపుల్లోకి రాదు... రాలేదు. ఇదే కాల ప్రభావం.. ఈ శరీరంతో ఇంకా ఏదైనా చేయవలసింది ఉంటే ఏదో రూపంలో కాలం, ప్రకృతి, ఆత్మబలం, సంకల్పబలం, పుజాఫలం, దానఫలం, ఔషదం, వైద్యుడు, శ్రేయోభిలాషి, బంధువు, , పుణ్య ఫలం మొదలైనవి మన శరీరం నుండి ఆత్మ విడి పోకుండా కర్మ పూర్తి చేసేవరకు బలాన్నిస్తాయి..జీవించి ఉన్నప్పుడే మన ఆత్మ బందువుల అంటే సమస్త జీవుల మీద ప్రేమను చూపిద్దాం... మనకు చేతనైన సహాయం చేద్దాం... మీరంతా సంపూర్ణ ఆయురారగ్యాలతో ఉండాలని కోరుకుంటూ... మీ ఆత్మబంధువు కాలభైరవ స్వామి. 🕉️శుభంభవతు 🕉️

No comments:

Post a Comment