Sunday, January 3, 2021

కాలభైరవ ఇరుముడి ఏలా కట్టుకోవాలి How To Prepare KalaBhairava Deeksha Irumudi https://youtu.be/pqh-N28ePc8 #పవిత్రకాలభైరవునిఇరుముడిఏలాకట్టుకోవాలి? How To Prepare KalaBhairava Deeksha Irumudi*ఇది సాధారణంగా ఎవరి ఇంటిలో వారే నిర్వహించుకుంటారు.*వారి జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులు,బంధువులు, ఇరుగు పొరుగువారు కుడా పాల్గొనవచ్చు. కాలభైరవదీక్షలో దీక్షాపరుడు తన తలపై మోసే కాలభైరవ ప్రతీక ఇరుముడి. దీక్ష వహించిన వారికి మాత్రమే దీన్ని మోయడానికి అనుమతి ఉంది. ఇరుముడి లేకుండా దీక్షావిరమణ, దీక్షాయజ్ఞకుండంలో ఆహుతులు వేయడానికి అనుమతి ఉండదు.3 నీలంరంగు వస్త్రముల పై ( లేదా బ్యాగ్ ల పై) ముందుగా సింధూరము తో స్వస్తిక్ మార్క్ వేయాలి. మరియు ఒకటి కాస్త పెద్ద వస్ట్రం. మూడూ కలిపి కట్టడానికి... గణపతి, సుబ్రహ్మణ్య మరియు మహాకాళీ కాలభైరవస్వామి వార్లకు అభిషేక, హోమాది , నైవేద్యాలను ఉంచడానికి ప్రత్యేకించబడింది. ముద్రవేసిన 1వ వస్త్రంలో గణపతికి మూడు పిడికెల్లు బియ్యం(అన్నప్రసాద సేవకు) గంధం పేకట్( అభిషేకానికి) మారేడుదళాలు(అర్చనకు) అగరుబత్తి (ధూపముకు) , ఎండుకొబ్బరి ముక్క (హోమకుండం)50గ్రా.పటిక బెల్లము పలుకులు పేకట్ (నైవేద్యంకోసం )- ముడి వేసి కట్టేయాలి.2వవస్త్రంలో సుబ్రహ్మణ్యస్వామికి మూడు పిడికెల్లు బియ్యం, గంధం డబ్బా, మారేడు దళాలు, అగరుబత్తి, ఎండు కొబ్బరిముక్క, 50గ్రా.బాదం పలుకులు పేకట్టు తర్వాత ముడి వేసి కట్టేయలి.3వ వస్త్రంతో మహాకాళీ కాలభైరవ స్వామి వార్లకు మూడు పిడికెల్లు బియ్యం( అన్నప్రసాద సేవకు), గంధం పేకట్ ( అభిషేకానికి), మారేడు దళాలు( అర్చనకు), అగరుబత్తి (ధూపంకు), నేతితో నింపిన కొబ్బరికాయ, 5లవంగాలు 5యాలకులు, కొన్నిమిరియాలు, దాల్చిన చెక్క, ఒక జాజికాయ (హోమ కుండం)జాకిట్టు వస్త్రం (అలంకరణకు) *బియ్యాన్ని రెండు చేతులతో తీసుకొని ఇరుముడిలో వేస్తారు. ఇది మూడుసార్లు జరుగుతుంది. కొంతమంది భక్తులు మొదటి బియ్యంతో పాటు మారేడుఆకులు దక్షిణ కూడా వేస్తారు. నెయ్యి నిండిన కొబ్బరికాయను ఎలా తయారు చేయాలి?కాలభైరవదీక్షా సిద్ధికోసం పూర్ణ నేతి కొబ్బరి: ఇరుముడి సమయానికి ముందు, మీడియం సైజు ముదురు కొబ్బరికాయను ఎంచుకోండి. బయటి పీచుతీసి శుభ్రంచేసి పాలిష్ చేయండి. షెల్ పోలిష్. కొబ్బరికాయవెనుక వైపు ఉండే 3 కన్నులలో ఒక కన్ను తెరిచి, అంతే రద్రం చేసి కొబ్బరి నీటిని ఖాళీ చేయండి. ఆరనివ్వండి. (ఇరుముడి కి కొన్ని గంటల ముందు ఇది చేయాలి)తదుపరి సరైన పరిమాణంలోని మాంచి తాజా నెయ్యిని మరిగించి కొబ్బరి కాయలో పోసి సీల్ వేయాలి. ‘ఓం నమో కాల భై ర వా య నమః' స్మరిస్తూ చెయాలి. కొబ్బరికాయను కార్క్ చేసి, మైనపు లేదా ఇతర ముద్రలను ఉపయోగించి సీలు చేస్తారు. తదుపరి ఆ నేతి కొబ్బరి కాయకు కొద్దిగా తడిగంధం, పసుపు, కుంకుమ సింధూరం బొట్టు పెట్టాలి.ఈ నెయ్యి నిండిన కొబ్బరికాయ ప్రధాన నైవేద్యం. ఒక కొత్త తువ్వాలు శిరస్సుపై ధరించి దీనిపై ఇరుముడి పెట్టుకోవాలి. ఇరుముడి లో సామాన్లు వేసేటప్పుడు, ముడి వేసు కోవడానికి వీలుగా దానికి తగినంత స్థలం ఉందని మరియు పూజా వస్తువులను పట్టుకోగలరని నిర్ధారించుకోండి. ఇరుముడి నిండిన తర్వాత, అది సాక్ష్యాత్తు ప్రధాన దేవతను సూచిస్తుంది. అందుకే గౌరవప్రదంగా భావించాలి. మరియు నేలపై ఉంచబడదు. క్రింద దింపేతప్పుడు టవల్, షీట్ లేదా రగ్గుపై ఉంచాలి దీపహారతి సమర్పించాలి. మరిన్ని వివరాల కోసం. 9618182456.www.KalaBhairava.in

No comments:

Post a Comment