World Famous Swarnakarshana Bhairava temple. ప్రపంచంలోనేఏకైక లక్ష్మి కుబేరస్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం రాజమండ్రి . భక్తులే వారి స్వహస్తలతో అభిషేకం, దూప హారతి, దీప హారతి నిర్వహించుకు నే అద్భుతమైన సదావకాశం.. ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి పర్వదినాల్లో దర్శించిన భక్తులకు డబ్బులను ప్రసాదంగా ఇచ్చే ప్రపంచంలో మొట్టమొదటి మహా పుణ్య క్షేత్రము. #ప్రతీపౌర్ణమిరోజుమంత్రోపదేశం:భారతీయుల ప్రాచీనభైరవతత్వం
Tuesday, April 13, 2021
#వృషభరాశివారికి2021 - 2022 శ్రీ ప్లవ నామ ఉగాది వార్షిక ఫలితాలు#KalabhairavaTV వృషభ రాశి:- కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి 1,2,3,4 పాదములు, మృగశిర 1, 2 పాదముల వారు వృషభరాశికి చెందుతారు.వృషభరాశి వారికి ఈ సంవత్సరంఆదాయం - 02 - వ్యయం - 08,రాజపూజ్యం- 07 , అవమానం -03.🟠గురువు :- ఉగాది ప్రారంభం నుండి సెప్టెంబర్ 14 వరకు దశమస్థానమైన ( కుంభం) లో రజితమూర్తిగా ఉంటాడు.తర్వాత నవంబర్ 20 వరకు తామ్ర మూర్తిగా .. ఆ తర్వాత సంవత్సరం అంతా సువర్ణమూర్తిగా ఉంటాడు.* శని :- సంవత్సరం అంతా ... తొమ్మిదో స్థానమైన ( మకరరాశి )లో రజితమూర్తిగా ఉంటాడు.* రాహు కేతువులు :- సంవత్సరం అంతా 1, 7 స్థానాలైన ( వృషభ, వృశ్చిక ) రాశులలో తామ్రమూర్తులుగా ఉంటారు.* గురువు ఉగాది నుండి 19 నవంబర్ 2021 వరకు అశుభ స్థానం వలన - తీవ్ర వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు.ముఖ్యంగా శారీరక సమస్యలుతో తరచుగా బాధించును.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం..#kalabhairavagurugantalapanchangam జీవితంతో ముడిపడి ఉన్న సంబంధ బాంధవ్యాలు చిన్న చిన్న మనస్పర్థల కారణంగా కోపం అనా ఆలోచన కారణంగా కొన్ని ఇబ్బందులు పడవచ్చు...స్వయం కృతాపరాధం వలన కొన్ని నష్టాలను అప్పులను కష్టాలను కొని తెచ్చుకుంటారు. మీ చుట్టూ ఉన్నవారే మిమ్మల్ని ముంచుదురు..ఏ ప్రయత్నం చేసినా కూడా మానసికంగా సంతృప్తి అనేది కనబడదు... ఎక్కువగా శ్రమించ వలసి వుంటుంది...19 నవంబర్ 2021 వరకు కొత్తగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టకుండా ఉండటం చాలా మంచిది. భాగస్వామ్య వ్యవహాలు వద్దు... మంచి మాటలు మాట్లాడే మాయగాళ్ల వలలో పడకుండా జాగ్రత్త పడాలి... ప్రేమ వ్యవహారాలు బెడిసికొట్టును.. నమ్మక ద్రోహం కలుగును.. పరువు ధనం నష్టం... ఎవరిని పడితే వాళ్లను గ్రుడ్డిగా నమ్మవద్దు...20 నవంబర్ 2021 నుండి వృషభరాశి వారికి గురువు యోగించి శుభఫలితాలు ఇస్తాడు.వృత్తి విద్యా కోర్సులు చదివిన వారికి ఉద్యోగ అవకాశములు కలుగుతాయి,అమ్మాయిల కు మరింత పరీక్ష కాలం..స్వయం ఉపాధి చేసుకునే వారికి విశేష లాభాలు కలుగుతాయి.విద్యార్థులకు అనుకూలమైన సమయం.తీర్ధ యాత్ర ప్రయాణములు 20 నవంబర్ 2021 తదుపరి పూర్తి చేయగలుగుతారు.సాంప్రదాయ బద్దమైన జీవితం ప్రారంభించడానికి అత్యంత అనుకూల కాలం.విడిచి పెట్టాలని అనుకున్న దురలవాట్లకు దూరం కాగలుగుతారు. కొన్ని దారిద్యాలు తొలగుతాయి...* శని భగవానుడు మంచి ఫలితాలను ఇస్తాడు .నూతన వాహన కోరిక నెరవేరును.వారసత్వ సంపద లభించును.పనిచేస్తున్న రంగములలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు.వ్యక్తిగత జాతకంలో శని బలంగా ఉంటే .. ఉద్యోగులకు పదవిలో ఉన్నతి లభింస్తుంది.అనుకున్నఆర్ధిక లక్ష్యాలను చేరుకొంటారు వ్యక్తిగత ఎవరి జాతకంలో శని స్వక్షేత్రంలో ఉన్ననులేదా ఉచ్చ స్థితి ఉన్ననూలేదా మూల త్రికోణములో ఉన్నవారు సులువుగా విశేషమైన ధనార్జన చేయగలరు.వీరు తమ వంశానికి, జాతికి పేరు ప్రఖ్యాతులు తెచ్చే .. సత్కార్యములు చేస్తారు.* రాహువు - కేతువుల వలన మిశ్రమ ఫలితాలు ఉంటాయి.సమాజంలో పేరు ప్రఖ్యాతులను పొందుతారు.ఉద్యోగులకు కోరుకున్న విధంగా స్థాన చలనం కలుగుతుంది.పితృ వర్గీయులతో ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోవును. పిత్ర బ్రాత ధన ప్రాప్తి.. కొంత శారీరకంగా అనారోగ్యం సమస్యలను మాత్రం ఎదుర్కొంటారు , అరోగ్య రక్షణ కల్పించుకోవాలి...వైవాహిక జీవతంలో తీవ్ర గొడవలు ఏర్పడే సూచలు ఉన్నాయి, కోప తాపాలు వద్దు.. ఓపిక పట్టండి... ప్రెస్టేజ్ కోసం అప్పులు చేయవద్దు..ఇంటి విషయాలు పట్టించుకోకుండా, వ్యసనాలకు బానిసై ఇంట్లో అశాంతి సృష్టిస్తున్న జీవిత భాగస్వామి మీద విసుగు పుడుతుంది,ఇది అందరికీ వర్తించదు .. వ్యక్తిగత జాతకంపై ఆధారపడి ఫలితం ఉంటుంది.* ( ఇతర అన్ని గ్రహ స్థానాలను ఆధారంగా ఫలితాలు ఇలా ఉండనున్నాయి. )గోచార గ్రహస్థితి వలన అనేక బరువు భాద్యతలు మోయవలసి వస్తుంది.తలపెట్టిన కార్యములలో విజయాన్ని సూచిస్తున్నాయి .ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది.వివాహయోగం ఉంది.వృత్తి, వ్యాపారాలలో ఆర్ధిక పురోగాభివృద్ది బాగుంటుంది.విదేశాలలో చదువుకునే అవకాశం లభిస్తుంది.ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది.ఆరోగ్య సమస్యలు ఉంటాయి. రోజు యోగాసనాలు, ధ్యానం చేయుట వలన కుదుటపడుతాయి .ముఖ్యమైన విషయాలలో పెద్దల మాట వినడం శ్రేయష్కరం అని గ్రహించండి .తల్లిగారి వైపు వంశ సూతకం వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి.వ్యవసాయ దారులకు సామాన్య లాభం కలుగుతుంది, కొంత జాగ్రత్తలు తీసుకోవడం అవసరం... అనవసర ఖర్చులు పెరగవచ్చు...ఉపాద్యాయులకు సన్మానం , తోటి ఉద్యోగులతో మంచి మిత్రుత్వం ఏర్పడుతుంది.రాజకీయ నాయకులకు అనుకూలం .. సెప్టెంబర్ లోగా ఏదైనా పదవి లభించే అవకాశం ఉంది. అధికార ప్రాప్తి.. కానీ కొంత మంది నీచులు మీ పై నిందలు మోపి అడ్డుకట్ట వేయడానికి పని చేసారు కానీ సంకల్పంతో మీరే విజయం సాధిస్తారు....విద్యార్ధులు చదువుపై ఎక్కువ కృషి చేయాలి. తల్లి తండ్రులు వారిని గమనిస్తూ ఉండాలి...అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు ప్రతీ రోజు దశ నామ రక్షా స్తోత్రము 11 మార్లు జపించండీ.. ప్రతీ అష్టమి అమావాశ్య పౌర్ణమి రోజుల్లో కాలచక్ర దీప పూజ చేయడం, నీటిలో 1 రాగి కాయిన్ 100 గ్రా.బెల్లం వేయడం ద్వారా శుభం కలుగుతుంది. భువనేశ్వరి అమ్మవారి పటానికి పసుపు రంగు పూలతో పూజించండి. కాలభైరవ అనుగ్రహ సిద్ధిరస్తు...సర్వేజనా: సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి:
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment