World Famous Swarnakarshana Bhairava temple. ప్రపంచంలోనేఏకైక లక్ష్మి కుబేరస్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం రాజమండ్రి . భక్తులే వారి స్వహస్తలతో అభిషేకం, దూప హారతి, దీప హారతి నిర్వహించుకు నే అద్భుతమైన సదావకాశం.. ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి పర్వదినాల్లో దర్శించిన భక్తులకు డబ్బులను ప్రసాదంగా ఇచ్చే ప్రపంచంలో మొట్టమొదటి మహా పుణ్య క్షేత్రము. #ప్రతీపౌర్ణమిరోజుమంత్రోపదేశం:భారతీయుల ప్రాచీనభైరవతత్వం
Tuesday, April 13, 2021
#మేషరాశి_శ్రీప్లవనామసంవత్సర 2021-2022 ఉగాది వార్షిక ఫలితాలు #KalabhairavaTV మేషరాశి:- అశ్విని నక్షత్రం 1,2,3,4 పాదములు, భరణి నక్షత్రం 1,2,3,4 పాదములు, కృత్తిక నక్షత్రం 1వ పాదములో జన్మించినవారు మేషరాశికి చెందుతారు .శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఈ సంవత్సరంఆదాయం - 08, వ్యయం - 14 ,రాజపూజ్యం - 04, అవమానం - 03.🟡గురువు :- ఉగాది ప్రారంభం నుండి లాభస్థానమైన ( కుంభం) లో నవంబర్ 20 వరకు తామ్ర మూర్తిగా .. నవంబర్ తర్వాత లోహమూర్తిగా ఉంటాడు.* శని :- సంవత్సరం అంతా ... దశమ స్థానం ( మకరరాశి )లో తామ్రమూర్తిగా ఉంటాడు.* రాహు కేతువులు :- సంవత్సరం అంతా 2 , 8 ( వృషభ, వృశ్చిక ) రాశులలో లోహమూర్తులుగా ఉంటారు. వ్యతిరేక ఫలితాలు ఇస్తారు .వారసత్వ బ్రాత సంబంధ సంపద విషయంలో తగాదాలు ఎదుర్కొందురు.కుటుంబంలో శుభకార్య గృహ వస్తూ వాహన స్వర్ణ సంబంధమైన ఖర్చులు అధికం..ముఖ్యంగా పితృవర్గంలోని పెద్ద వయస్సు వారికి తీవ్ర ఆరోగ్య సమస్యలు మరియు ప్రాణ గండములు ఏర్పడే పరిస్థితి గోచరిస్తున్నది....వ్యక్తిగత జాతకంలో గురు గ్రహం నీచ క్షేత్రంలో ఉన్నవారు గురు దత్తాత్రేయ స్వామి మంత్రం జరిపించుట, ప్రతీ ఆదివారం పసుపు రంగు పండ్లు గురువులకు సమర్పించి వారి ఆశీస్సులు పొందుట మంచిది.* 20 - నవంబర్ -2021 నుండి గురువు అనుకూలమైన శుభ ఫలితాలను ఇస్తాడు.న్యాయమైన ధన సంపాదన కలిగించును.జీవన విధానంలో నూతన యోగములను ప్రసాదించును.* శని సంవత్సరం అంతా అనుకూలమైన శుభ ఫలితాలను ఇస్తాడు.ఆశించిన విధంగా ధన సంపాదన కలుగజేస్తాడు.నల్లని వస్తువులు,నల్లని ధాన్యములు,లోహములకు సంబంధించిన వ్యాపారం చేసే వారికి మంచి లాభములు కలుగజేయును.నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అగును. ఉద్యోగ ప్రాప్తి...సంతానం లేని వారికి సంతాన సౌఖ్యం కలుగచేయును.రాహువు సంవత్సరం అంతా మంచి ఫలితాలను ఇస్తాడు.* కేతువు అశుభత్వం వలన అనేక సమస్యలు ఏర్పడును.శారీరక సౌఖ్యం తక్కువ అగును.ప్రతి పనికి ఎక్కువగా శ్రమింప జేస్తాడు.ఎవరి వ్యక్తిగత జాతకంలో పితృ స్థానంలో కేతు గ్రహ దోషములు ఉన్నవారికి పితృ ఖర్మలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడు సూచనలు ఉన్నాయి.ఆధ్యాత్మిక జీవన సాధనలో ఆశించిన పురోగతి లభించక మరింత పరీక్షలు ఎదురు అగును.. దైవోపాసన చేయలనుకునే వారికి కొన్ని విఘ్నములు ఏర్పడుతాయి. సంకల్పంతో భక్తి తో సాధించవచ్చు..కొన్నివిషయాలలో మీ ప్రమేయమేమి లేకుండానే అపవాదులు నిందలు మరియు అవమానములను పొందడాన్ని సూచించుచున్నది. జాగ్రత్త ఎవరితోనూ అనవసరంగా ఎక్కువ మాట్లాడ వద్దు..వృత్తి, ఉద్యోగాలలో స్థిరత్వం వస్తుంది.ప్రేమ వ్యవహారం పట్ల నమ్మక ద్రోహం.. సమయం వృధా, ధన నష్టం, కీర్తి ప్రతిష్టలకు నష్టం, పెద్దవారికి ప్రాణ గండం... అవివాహితులకు వివాహయోగం కల్గుతుంది. ఉత్తమ జీవిత భాగస్వామి యోగం...సంతానప్రాప్తి. ( దంపతులిరువురి వ్యక్తిగత జాతకాల ఆధారంగా ఫలితాలు ఉంటాయి )ఆత్మీయులతో, జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి.స్వార్ధ పరులు, ఆవకాశవాదులు మీ దరిచేరుతారు, దొంగలను నమ్ముతారు.. వారి మాయలో పడి ధనం పరువు పోగొట్టుకుంటారు.. కేసుల్లో కోర్టు గొడవల్లో ఇరుక్కోవడం జాగ్రత్తలు వహించవలెను.స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు.వాహన యోగం,గృహ యోగం.రాజకీయ రంగాలవారికి పదవియోగం.స్త్రీలతో విరోధం. పరస్త్రీ, పరపురుష, అక్రమ సంబంధముల వల్ల కీర్తి ప్రతిష్టలకు భంగం, పదవీ గండం, అధికారం కోల్పోవడం, అప్పుల పాలు అవ్వడం, గుట్టు రట్టవడం, విలువ లేని వారితో కూడా మాటలు పడడం... కేసుల్లో ఇరుక్కోవడం జరిగే అవకాశం జాగ్రత్త పడాలి..అంతర్గత రాజకీయాలు పెరుగుతాయి. మీపై కుతంత్రాలు పన్ని పదవిని సైతం ఉడగొడతానికి పన్నాగాలు పన్నుతారు.. మీ ఫోన్లు టాప్ చేయడం... రహస్య వీడియోలు తీయడం మీపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరిగే అవకాశం... జాగ్రత్త మీ చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోండి.... ఈ సంవత్సరం తలపెట్టిన కార్యాలు మూడు వంతులు పూర్తిచేస్తారు.వ్యవసాయ దారులకు రెండు పంటలు లాభిస్తాయి. ధన వృద్ది... ఉద్యోగులకు పదోన్నతులు కల్గుతాయి.నూతనంగా వ్యాపారం చేయాలనుకునే వారికి అనుకూలంగా ఉంది.విద్యార్ధులకు ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులైయ్యే అవకాశాలున్నాయి . దశ నామ రక్షా స్తోత్రము జపించండి..సినిమా, టీవి, రంగాల వారికి కాస్త మంచి దారి కనిపిస్తుంది... మిమ్మల్ని మీ టాలెంట్ ను వాడుకుని వదిలేసే వారు ఉంటారు... జాగ్రత్త... మీ ఫోన్లు టాప్ చేయడం... రహస్య వీడియోలు తీయడం మీపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతుంది... #KalaBhairavaGuruGantalaPanchangamఅనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు ప్రతీ ఆదివారం మీ గృహంలో సాయంత్రం 4.30 నుండి 6 గం. ల మధ్య లో ఒక ఇత్తడి ప్లేట్ లో కుంకుమతో త్రికోణ 🔺 ఆకారం వేసి దాని మీద ఎండు కొబ్బరి ఉంచి నువ్వుల నూనెతో దీపారాధన చేసి పంచ పూజలు చేసి కాలభైరవ సహస్రనామ స్తోత్రం పారాయణ ఒకసారి చేయండి. కాళీ, బగలా ముఖీ అమ్మవారిమంత్రం రోజూ ఒకమాల జపించండి. సింధూరము కలిపిన అక్షతలతో,ఎర్రని పూలతో పూజించండి.. ఆదివారం 27 మార్లురావివృక్ష ప్రదక్షణ చేయండి.. శుభం కలుగుతుంది...కాలభైరవ అనుగ్రహ సిద్ధిరస్తు...సర్వేజనా: సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి:
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment