Monday, April 12, 2021

శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాదికి స్వాగతం సుస్వాగతం #ugadi2021#ఆయురారోగ్య_అష్టైశ్వర్యప్రాప్తిరస్తు.కాలభైరవఅనుగ్రహసిద్ధిరస్తు...వికారినామ సంవత్సరము(2019), పేరుకు తగినట్టుగా వికృతమైన పరిస్థితులను.. శార్వరి(అంటే, చీకటి) నామ సంవత్సరం (2020) విశ్వాన్ని అంధకార స్థితిగతులను.. ఇప్పుడు ప్లవ నామ సంవత్సరం మొదలైనది. ఇది శుభప్రదమైన సంవత్సరం గా బావిద్దాం..... ప్లవ అంటే, దాటించునది అని అర్థం. "దుర్భిక్షాయ ప్లవ ఇతి. తతశ్శోభనే భూరితోయం......." దుర్భరమైన ప్రతికూలతను దాటించి భూమికి శోభను చేకూరుస్తుంది అని వరాహసంహిత వివరించింది. అంటే చీకటి నుంచి వెలుగు లోకి నడిపిస్తుందని అర్థం. వికారి, శార్వరి తమ పేర్లకు తగ్గట్టుగా నడిపించాయి గదా. మరి ప్లవ తన పేరును సార్థకం చేసుకుంటుందని ఆశించటం తర్కసహితమైన ఆలోచనయేగదా. ప్లవ నామ సంవత్సరం ముగియగానే "శుభకృత్", ఆ తరువాతది " శోభకృత్" సంవత్సరములు. పేరుకు తగ్గట్టుగా ఇవి కూడనూ మన మనసుకు సంతోషాన్ని, వికాసాన్ని కలిగిస్తాయి. అభయాన్ని ప్రసాదిస్తాయి.అందుకే, ప్లవ నామ సంవత్సరానికి స్వాగతం, సుస్వాగతం...http://www.facebook.com/kalabhairavaTV

No comments:

Post a Comment