Thursday, May 13, 2021

#AkshayaTrititya14thMay2021: అక్షయ తృతీయ రోజున ఈ మంత్రాలు పఠిస్తే.. లక్ష్మీదేవి కటాక్షం కొసం స్వర్ణ మంత్రం జపించాలి...!మన పంచాంగం ప్రకారం, వైశాఖ మాసంలో శుద్ధ తదియ నాడే అక్షయ తృతీయ జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో 2021 సంవత్సరంలో మే 14వ తేదీ ఈ పండుగ వచ్చింది.అక్షయం అంటే ఎప్పటికీ తరగనిది. ఈరోజు ఇంట్లో పూజ చేయడంతప్పనిసరి అంటే చిన్న చిన్న విగ్రహాలకు, యంత్రాలుకు,నాణాలకు, సాలగ్రామాలకు, శంఖు లకు, ఇలా దేవుని మందిరంలో ఉండే అన్ని అఖండ దైవిక వస్తువులకు గంధ, హరీంద్ర, కుంకుమ, పుష్ప జలాలతో అభిషేకం, పంచ పూజలు తప్పక చేసి స్వర్ణ మంత్రం జపించాలి..ఇంకా మరిన్ని వివరాలకు మన Facebook Page Like చేయండి.kalabhairavaTV*వేదాల్లో, మహర్షి తత్వాల్లో, భారతీయ సనాతన ధర్మంలో, గురువాక్కులలో మాత్రం బంగారం, ఆభరణాలు కొనుగోలు చేయాలని ఎక్కడ చెప్పలేదు.. ఆరోజు బంగారమే తప్పక కొనాలి అంటే మన అంత మూర్ఖులు ఎవరూ ఉండరు... కనీస భగవత్ జ్ణానం కూడా లేదని అర్థం....అయితే అక్షయ తృతీయ రోజున స్వర్ణా కర్షణ భైరవ స్వామిని, లక్ష్మీమాతను, కుబేర స్వామిని తులసి, మారేడు, సింధూర వర్ణ అక్షితల తో అర్చించి, కొబ్బరి దీపం వెలిగించడం వల్ల ధన, ధాన్య, స్వర్ణ, రాజయోగ, లక్ష్మీయోగ, కుబేరయోగ, మంగళయోగ, ఆరోగ్యసిద్ధి తప్పక కలుగును. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారితో పాటు సమస్త దేవతలకు ధనమును ఇచ్చే కుబేరునికి, మరియు సర్వ జనులకు ధనమును ఇచ్చే లక్ష్మి మాతకు ధమును ప్రసాదించే అమృతముర్తి యే స్వర్ణభైరవుడు.. ఇంతటి పవిత్రమైన రోజున స్వర్ణా కర్షణ భైరవ స్వామిని, లక్ష్మీదేవి, కుభేరుడిని పూజిస్తే సానుకూల ఫలితాల వస్తాయని పండితులు చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల తమ ఇంట్లో సిరి సంపదలు విశేషంగా పెరుగుతాయని చాలా మంది నమ్మకం. లక్ష్మీ మాతను, శ్రీవిష్ణువుకు వివాహం చేసుకున్న శుభ దినం కూడా ఇదే... వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. అక్షయ తృతీయ రోజున శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణా కర్షణ భైరవస్వామిని పుజించి ఈ మంత్రాలను కచ్చితంగా పఠించాలి. ఈ మంత్రాలను పఠించడం వల్ల మీకు లక్ష్మీదేవి కటాక్షం కచ్చితంగా లభిస్తుంది... ఈ సందర్భంగా ఆ మంత్రాలేవో మీరూ చూడండి... మీరు పూజా సమయంలో వీటిని పఠించండి. మీ ఇంట సిరిసంపదలు నింపుకోండి...Swarnakarshana Bhairava*ఓమ్ నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వ్రుద్దికరాయ శ్రీఘ్రమ్ ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా*మంత్రాన్ని 1008 సార్లు ఉచ్చరించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కచ్చితంగా లభిస్తుందట. దీంతో పాటు కాలభైరవ సహస్ర నామ స్తోత్రం పారాయణ ఒకసారి చేయండి....Dasanama Rakshaఓం కపాలి,కుండలీ ,భీమో, భైరవో ,భీమవిక్రమః, వ్యాలోపవీతీ ,కవచీ , శూలీ, శూరః ,శివప్రియఃLakshmi Ganapathi లక్ష్మీ గణపతి మంత్రం"ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనంమే వశమానయ స్వాహా"Vatuka Bhairava.శతృ, గ్రహా బాధలు దూరం అవుటకు."ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం"Batuka Bhairava విద్యా, ఉద్యోగ సిద్ధి కి..Unmatta Bhairava Aarogya Mantra..ఓం హ్రీం హ్రీం ఉం ఉం ఉన్మత్త భైరవాయ సంపూర్ణ ఆరోగ్యం దేహి దేహిఓం హ్రీం బటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు బటుకాయ హ్రీం ఓం

No comments:

Post a Comment