World Famous Swarnakarshana Bhairava temple. ప్రపంచంలోనేఏకైక లక్ష్మి కుబేరస్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం రాజమండ్రి . భక్తులే వారి స్వహస్తలతో అభిషేకం, దూప హారతి, దీప హారతి నిర్వహించుకు నే అద్భుతమైన సదావకాశం.. ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి పర్వదినాల్లో దర్శించిన భక్తులకు డబ్బులను ప్రసాదంగా ఇచ్చే ప్రపంచంలో మొట్టమొదటి మహా పుణ్య క్షేత్రము. #ప్రతీపౌర్ణమిరోజుమంత్రోపదేశం:భారతీయుల ప్రాచీనభైరవతత్వం
Thursday, May 13, 2021
#AkshayaTritiya14మే2021 : అక్షయతృతీయ పట్టిందల్లా బంగారమే ఈపనులు చేయటం వల్ల.అక్షయ తృతీయ రోజున కొన్ని దానాలు చేస్తే ఎంతో మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.. కొన్ని దానాలు చేయడం వల్ల పట్టిందల్లా బంగారమే అవుతుందని.. సిరిసంపదలకు ఏమాత్రం లోటు ఉండదని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. వైశాఖ శుద్ధ తృతీయనే అక్షయ తృతీయ అంటారు. అక్షయం అంటే క్షయం లేకుండా ఉండాలని అర్థం.. ఈ రోజున కొన్ని దానాలు చేస్తే ఆ ఫలితం, పుణ్యం అక్షయంగానే ఉంటుందంటారు. అంటే ఎంత ఖర్చు పెట్టినా సిరిసంపదలు ఇంకా వస్తూనే ఉంటాయని చెబుతారు.. మరి ఈ రోజున ఎలాంటి పనులు చేయాలో చూద్దాం.. ఈరోజున తల్లి తండ్రులు పాదాలకు నమస్కారం చేసి వారి ఆశీర్వాదం పొందడం చాలా మంచిదట.. ఒకవేళ తల్లితండ్రులు దగ్గరలో లేకపోయినా, వారు గతించిన సరే వారిని స్మరించి వారి పేరున ఒక పూట పెరుగన్నం అన్నం పెట్టినా మంచిదే.. అదేవిధంగా.. ఈరోజున 1.పెరుగన్నం, 2.విసనకర్ర, 3.చెప్పులు, 4.గొడుగు, 5.చల్లనినీరు ఉన్న మట్టికుండను దానం చేయాలి. ఎందుకంటే.. ఈ వేసవిలో ఇవన్నీ కూడా ఈ వేసవిలో ప్రజలకు ఉపయోగపడేవి.. అయితే ఏదో ఇచ్చాం కదా అన్నట్లు ఇవ్వకూడదు.. ప్రజలకు మంచిజరగాలని కోరుకుంటూ మనమైతే ఏవీ తీసుకోవడానికి ఇష్టపడతామో ఇతరులకు ఇచ్చేటప్పుడు కూడా అలాంటివే ఇవ్వాలి. వేడివేడి అన్నంలో పెరుగు కలిపి ఇవ్వాలి. ఇలా చేస్తే శరీరంలోని ఉష్ణాన్ని పోగొట్టినవారవుతాం.. విసనకర్ర.. ఉక్కపోతతో అల్లాడుతున్నవారికి ఉపయోగపడేదే.. చెప్పులు.. బయటికి వెళ్లేప్పుడు అందరికీ అవసరమే.. చల్లని నీరు.. ఇది ఫ్రిజ్ నీరు కాదు.. మట్టికుండలోనీరు.. ఇలా చేస్తే ఎంతో పుణ్యమని చెబుతున్నారు. అదేవిధంగా.. తెల్లని వస్త్రాలు వీటి వల్ల ఎండల ప్రభావం అంతగా ఉండదు.. ఈ కాలంలో దొరికే 1.మామిడిపండ్లు, 2.పనసతొనలు కూడా ఇవ్వాలి..ఇక పితృదేవతలకు జ్ఞాపకార్థం కూడా చేయడం మంచిదని చెబుతారు..ఎప్పుడు కూడా దానం చేయడం మంచిదే.. ఈ రోజు చేస్తే ఇంకా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. దానం చేసింది కూడా మనకు నచ్చినవారు.. ఆర్థికస్థితి మెరుగ్గా ఉన్నవారికి కాకుండా.. లేనివారికి చేస్తే చాలా మంచిది.. మనకు కూడా ఆ ఆత్మతృప్తి ఉంటుంది.. కాలభైరవ స్వామి అనుగ్రహ సిద్ధిరస్తు....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment