Thursday, April 15, 2021

#కర్కాటకరాశివారికి2021 - 2022 శ్రీ ప్లవ నామ ఉగాది వార్షిక ఫలితాలు #KalabhairavaTV పునర్వసు నక్షత్ర 4 వ పాదాల వారు, పుష్యమి నక్షత్ర 1,2,3,4 పాదములవారు, ఆశ్లేష నక్షత్ర 1,2,3,4 వ పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుదురు.శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కర్కాటకరాశి వారికిఆదాయం 14, వ్యయం - 02,రాజ పూజ్యం - 06, అవమానం - 06🟡గురువు :- ఉగాది ప్రారంభం నుండి సెప్టెంబర్ 14 వరకు అష్టమ స్థానమైన ( కుంభం) లో తామ్రమూర్తిగా .. తర్వాత నవంబర్ 20 వరకు సప్తమంలో రజితమూర్తి.. ఆ తర్వాత సంవత్సరం అంతా అష్టమంలో సువర్ణ మూర్తిగా ఉంటాడు.🔵శని :- సంవత్సరమంతా ... సప్తమ స్థానమైన ( మకరరాశి )లో తామ్ర మూర్తిగా ఉంటాడు.⚫రాహు 🟣కేతువులు :- సంవత్సరమంతా 11 , 5 ( వృషభ, వృశ్చిక ) రాశులలో రజిత మూర్తులుగా ఉంటారు.గురువు ఉగాది నుండి ఆశుభుడు కాబట్టి సంవత్సరమంతా అనుకూల ఫలితాలను ఇవ్వడు.#kalabhairavagurugantalapanchangam గత శార్వరి నామ సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా వలన కొన్ని ఇబ్బందులతో కొనసాగును.ముఖ్యంగా గురువు నవంబర్ 20 నుంచి తీవ్రమైన ఆర్ధిక సమస్యలు కలుగజేయును .స్వార్జితం మరియు పిత్రార్జిత ధన సంపదలు రెండూ ఖర్చు అవుతాయి .వ్యక్తిగత జాతకంలో గురువు నీచ క్షేత్రలో కానీ లేదా శత్రు స్థానాలలో ఉంటే గురువు శని రాహు కేతు అనుగ్రహం కోసం కాలభైరవ దర్శనం చేసుకొని నల్లమినపప్పు 19గారెల దండ, 19నిమ్మకాయల దండ సమర్పించండి మంచిది.గృహంలో ఎండుకొబ్బరి లో దీపం వెలిగించి అష్ట భైరవ మంత్రం చదవండి.. #KalaBhairavaGuru#కాలభైరవగురుగంటలపంచాంగం33రకాల శక్తివంతమైన జాతక జీవిత పరిహార సూచనలతో అన్ని పుస్తక పూజా సంబంధ దుకాణాల్లో అందుబాటులో ఉన్నది...http://www.facebook.com/kalabhairavaTVసర్వేజనా: సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి: చేయించాలి.* శని వలన ఉద్యోగ జీవనంలో కొద్దిపాటి ఉన్నతి లభించును.కష్టం మీద పదోన్నతి మరియు ప్రయత్నాలలో విజయం పొందుతారు .జాతకంలో శని వలన కళత్ర దోషం ఏర్పడిన వారు వివాహ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొందురు.విశేషించి అనారోగ్య సమస్యలు ఏర్పడు సూచనలు ఎక్కువగా ఉన్నాయి.ఆరోగ్య పరమైన విషయాలలో ఎంత మాత్రం అశ్రద్ద పనికిరాదు.* రాహువు - కేతువులు ఇద్దరూ అనుకూలమైన శుభ ఫలితాలను ఇస్తారు .ఆర్ధిక అంశాలలో ఏమైనా మిగులు ధన లాభం ఉన్నదంటే అది రాహు - కేతువుల వలననే ఏర్పడును.ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి విజయం ఏర్పరచును.సంతాన ప్రయత్నాలు చేయు వారికి చక్కటి సంతాన సౌఖ్యం ఏర్పరచును.* ( ఇతర అన్ని గ్రహ స్థానాలను ఆధారంగా ఫలితాలు ఇలా ఉండనున్నాయి. )వృత్తి వ్యాపారాలలో కుటుంబ వ్యవహారములలో విజయాన్ని సూచించుచున్నది.* అవివాహితులకు వివాహ యోగం.ప్రేమ విషయంలో మోసపోవడం.. ధనం నష్టం జరుగు తుంది... సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగును.వ్యక్తిగత జాతకాల ఆధారంగా భార్యాభర్తలకు సంబంధించి కొందరి విషయాలలో దూరం అవడం కానీ లేదా విడిపోవడం కానీ శాశ్వతంగా దూరం అవ్వడం కాని జరిగే ఆస్కారం ఉంది. ( ఇది అందరికీ వర్తించదు. )రాజకీయ రంగాలలో రానిస్తారు. కానీ సెప్టెంబర్ వరకు స్వంత పార్టీ వారితోనే ఇబ్బందులు వస్తాయి.మీ వెనుక ఉన్నవారే మిమ్మల్ని క్రిందకు దిగి పోయేలా చేస్తారు... అనుమాాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం...జీవితంలో కొంత మంది దూరం అవుతారు.వ్యాపారం పరంగా వచ్చిన ఒక అవకాశాన్ని సద్వినియోగ పరచుకుంటారు.కుటుంబంలో అందరితో కలిసి ఉన్ననూ .. మీరు ఒంటరివారేనన్న భావన కల్గుతుంది .విద్యాకు సంబందించి విదేశీయాన సంబంధ విషయాలు అనుకూలిస్తాయి.ఈతలకు ( స్విమ్మింగ్ ) లకు దూరంగా ఉండాలి, జల గండ సూచనలున్నాయి.వ్యవసాయ దారులకు మొదటి పంట అనుకూలంగా వస్తుంది. రెండవ పంట ఆశించినంత రాకపోవచ్చును.ఉద్యోగస్తులకు ఇష్టం లేని బదిలీలు ఉంటాయి.తోటి ఉద్యోగులతో విరోధాలు ఏర్పడే సూచనలున్నాయి.ప్రేమ వ్యవహారాలు వల్ల దారుణమైన నష్టం.. అక్రమ సంబంధాలు వల్ల కీర్తి ప్రతిష్టలకు భంగం.. కేసులు... కోర్టు గొడవల్లో ఇరుక్కోవడం.. మరణ భయం...పై అధికారులతో సఖ్యత ఉండదు.అవకాశం చేసుకుని చండీ మూల మంత్రం జపిస్తూ ఉంటే మంచిది.అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు లక్ష్మీ కుబేర స్వర్ణ ఆకర్షణ మంత్రం రోజూ 3 మాలలు జపించంది. బహుళ అష్టమి నాడు గృహంలో Swarnakarshana Bhairava Swamy Vratam మంచి జరుగుతుంది.సర్వేజనా: సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి:

Wednesday, April 14, 2021

#మిధునరాశి2021 - 2022 శ్రీ ప్లవ నామ ఉగాది వార్షిక ఫలితాలు#KalabhairavaTV మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1,2,3,4 పాదములు, పునర్వసు 1,2,3 పాదములలో జన్మించినవారు మిధునరాశికి చెందుతారు.శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మిధునరాశి వారికిఆదాయం - 05 , వ్యయం - 05రాజ పూజ్యం - 03, అవమానం - 06🟡గురువు :- ఉగాది ప్రారంభం నుండి సెప్టెంబర్ 14 వరకు భాగ్యస్థానమైన ( కుంభం) లో లోహమూర్తిగా ఉంటాడు .. ఆ తర్వాత నవంబర్ 20 వరకు అష్టమంలో సువర్ణ మూర్తిగా ఉండి .. తదనంతరం సంవత్సరం అంతా తొమ్మిదో ఇంట్లో లోహమూర్తిగా ఉంటాడు.🔵శని :- సంవత్సరం అంతా ... అష్టమ స్థానమైన ( మకరరాశి )లో లోహమూర్తిగా ఉంటాడు.⚫రాహు 🟣కేతువులు :- సంవత్సరమంతా 6 , 12 ( వృషభ, వృశ్చిక ) రాశులలో సువర్ణ మూర్తులుగా ఉంటారు.గురువు :- అశుభత్వం వలన ఉగాది నుండి 19 - నవంబర్ -2021 వరకు కొన్ని ఆటంకాలు కలుగజేసే అవకాశం ఉంది.ఉద్యోగ జీవనంలో ఆకస్మిక నష్టాలు గోచరిస్తున్నాయి , జాగ్రత్త పడాలి...సంతాన సంబంధ అనారోగ్యతలు ,పిత్రార్జిత ఆస్తి మరియు ఉమ్మడి ఆస్తి విషయంలో తోబుట్టువుల వలన న్యాయస్థాన సమస్యలు, కోర్టు కేసులు, చీట్స్ ఫైనాన్స్ సంస్థ యందు జాగ్రత్త... మీ డబ్బు తస్కరించి పారిపోయే అవకాశం ఉంది...మెదడు నరాలు లేదా రక్తానికి సంబందించిన ఆనారోగ్య ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . అరోగ్య విషయంలో అలసత్వం వద్దు..ప్రేమ విషయంలో మోసపోవడం, నమ్మక ద్రోహం కలుగును... అమ్మాయిలకు ఎక్కువ నష్టం...20 - నవంబర్ - 2021 నుండి గురువు శుభత్వం వలన మిధున రాశి వారికి పూర్తిగా అనుకూలించును.వారసత్వానికి సంబంధించిన అనేక సమస్యలు తొలగి .. స్థిరాస్తి లాభములు అనుభవింపచేయును.మిధునరాశికి చెందిన సంతానం వలన వారి తల్లిదండ్రులు కూడా 20 -నవంబర్ -2021 తదుపరి మంచి ఫలితాలను పొందుతారు.అన్ని విధాలుగా గురువు నవంబర్ 20 నుండి అనుకూల ఫలితాలను ఇస్తాడు.*మిధునరాశి వారికి అష్టమశని ప్రభావం వలన ప్రతికూలమైన ఫలితాలను ఇస్తాడు.ఆరోగ్య పరంగా సమస్యలు కొనసాగును.వృద్ధులైన తల్లిదండ్రులకు ఈ సంవత్సరం అంతా ప్రమాద కరమైన కాలం.కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాల పట్ల ఎప్పుడు జాగ్రత్తగా ఉండవలెను.శని దేవునికి అనుగ్రహం కోసం కాలభైరవ అష్టకం చదవండి.. కాళీ మాత మంత్రం జరిపించుకోనుట మంచిది.* రాహువు - కేతువు వలన వ్యాపార సంబంధమైన, వివాహ సంబంధమైన విషయాల్లో మరియు కోర్టు తగాదాలలో విజయం సాధిస్తారు.ఈ సంవత్సరం అంతా ఎక్కువగా వృధా ఖర్చులు ఉంటాయి, చేస్తారు .సంపాధించిన ధనం చేతిలో నిలుపుకోలేరు.అనుకున్న విధంగా ధనం పొదుపు చేసుకోలేరు.స్నేహితుల వలన ఆర్ధిక సంబంధిత ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉన్నాయి,నమ్మక ద్రోహలు ఉంటాయి తస్మాత్ జాగ్రత్త. డబ్బు పోగొట్టు కోవడం జరగ వచ్చు...ఈతలకు ( స్విమ్మింగ్ ) లకు దూరంగా ఉండాలి, జల గండ సూచనలున్నాయి. విహార యాత్రలు చేసే క్రమంలో జాగ్రత్త...పాట్నర్ షిప్ వ్యాపారం చేసే వారు ఆర్ధిక అంశాలలో ఎక్కువ జాగ్రత్తతో ఉండవలెను.సెల్ఫ్ డ్రైవింగ్ చేసే క్రమంలో జాగ్రత్త అవసరం.. వాహనాలతో మరియు ప్రయాణాలలో ఎక్కువ జాగ్రత్తగా ఉండవలెను.* ( ఇతర అన్ని గ్రహ స్థానాల ఆధారంగా ఫలితాలు ఇలా ఉండనున్నాయి. )వృత్తికి సంబంధించిన వ్యవహాములలో విజయాలను సూచిస్తున్నాయి.ఉన్నత విద్యకు ఎంపిక అవుతారు.స్వయం కృషితో శ్రమించి మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు.స్వగృహ నిర్మాణం కల ఈ సంవత్సరం నెరవేరుతుంది.సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి. ( దంపతులిరువురి వ్యక్తిగత జాతకాల ఆధారంగా ఫలితాలు ఉంటాయి )ఉద్యోగంలో భాద్యతతో కూడిన అధికారం పెరుగుతుంది.రాజకీయ జీవితంలో ఇది పరీక్షా కాలం లాగా ఉంటుంది. మౌనం మంచిది. మాట జారకూడదు .మీ చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోండి.. వెనక నుంచి గోతులు తీసే అవకాశం ఉంది...స్వయం కృతాపరాధం వలన కొన్ని బంధాలను నష్ట పోవలసి వస్తుంది.తొందరపడి మాట్లాడం, నిర్ణయం తీసుకోవడం తీసుకోవద్దు. నోటి దురుసు మంచిదికాదని గ్రహించండి.సంవత్సర ద్వితీయార్ధంలోజీవితం మరో కొత్త పంధాలో నడుస్తుంది.మీ పేరు మీద ఉన్న స్థిరాస్తులకు విలువ పెరుగుతుంది.విలువైన వస్తువులు, ముఖ్య పత్రాలు, సర్టిఫికెట్లు మొదలగు విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం,అశ్రద్ధ వలన ముఖ్యమైనవి పోగొట్టుకునే అవకాశం ఉంది, జాగ్రత్త .వ్యవసాయ దారులకు రెండు పంటలు అనుకూలం, లాభాలు ఉంటాయి.ఉద్యోగస్తులకు అనుకూలమైన స్థాన చలనం ఉంది.రాజకీయ నాయకులు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటే మంచిది.వ్యాపారస్తులకు ధర్మబద్దత కూడిన .. న్యాయమైన వ్యాపారాలలో లాభాలు ఉన్నాయి.మోసపూరితమైన .. తప్పుడు వ్యాపారాలు ఎప్పటికైనా ప్రమాదం అని గ్రహించండి.విద్యార్ధులు ఎక్కువ శ్రద్ద పెట్టి చదువుకోవాలి.అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు రోజూ కాలభైరవ అష్టకం చదవండి... అమావాశ్య రోజున 19 గారెలు భైరవ స్వామికి సమర్పించ వలెను..#ugadi20212022 #కాలభైరవగురుగంటలపంచాంగం33రకాల శక్తివంతమైన జాతక జీవిత పరిహార సూచనలతో అన్ని పుస్తక పూజా సంబంధ దుకాణాల్లో అందుబాటులో ఉన్నది...http://www.facebook.com/kalabhairavaTVసర్వేజనా: సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి:

#ugadi20212022 #కాలభైరవగురుగంటలపంచాంగం33రకాల శక్తివంతమైన జాతక జీవిత పరిహార సూచనలతో అన్ని పుస్తక పూజా సంబంధ దుకాణాల్లో అందుబాటులో ఉన్నది...http://www.facebook.com/kalabhairavaTV

Tuesday, April 13, 2021

#వృషభరాశివారికి2021 - 2022 శ్రీ ప్లవ నామ ఉగాది వార్షిక ఫలితాలు#KalabhairavaTV వృషభ రాశి:- కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి 1,2,3,4 పాదములు, మృగశిర 1, 2 పాదముల వారు వృషభరాశికి చెందుతారు.వృషభరాశి వారికి ఈ సంవత్సరంఆదాయం - 02 - వ్యయం - 08,రాజపూజ్యం- 07 , అవమానం -03.🟠గురువు :- ఉగాది ప్రారంభం నుండి సెప్టెంబర్ 14 వరకు దశమస్థానమైన ( కుంభం) లో రజితమూర్తిగా ఉంటాడు.తర్వాత నవంబర్ 20 వరకు తామ్ర మూర్తిగా .. ఆ తర్వాత సంవత్సరం అంతా సువర్ణమూర్తిగా ఉంటాడు.* శని :- సంవత్సరం అంతా ... తొమ్మిదో స్థానమైన ( మకరరాశి )లో రజితమూర్తిగా ఉంటాడు.* రాహు కేతువులు :- సంవత్సరం అంతా 1, 7 స్థానాలైన ( వృషభ, వృశ్చిక ) రాశులలో తామ్రమూర్తులుగా ఉంటారు.* గురువు ఉగాది నుండి 19 నవంబర్ 2021 వరకు అశుభ స్థానం వలన - తీవ్ర వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు.ముఖ్యంగా శారీరక సమస్యలుతో తరచుగా బాధించును.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం..#kalabhairavagurugantalapanchangam జీవితంతో ముడిపడి ఉన్న సంబంధ బాంధవ్యాలు చిన్న చిన్న మనస్పర్థల కారణంగా కోపం అనా ఆలోచన కారణంగా కొన్ని ఇబ్బందులు పడవచ్చు...స్వయం కృతాపరాధం వలన కొన్ని నష్టాలను అప్పులను కష్టాలను కొని తెచ్చుకుంటారు. మీ చుట్టూ ఉన్నవారే మిమ్మల్ని ముంచుదురు..ఏ ప్రయత్నం చేసినా కూడా మానసికంగా సంతృప్తి అనేది కనబడదు... ఎక్కువగా శ్రమించ వలసి వుంటుంది...19 నవంబర్ 2021 వరకు కొత్తగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టకుండా ఉండటం చాలా మంచిది. భాగస్వామ్య వ్యవహాలు వద్దు... మంచి మాటలు మాట్లాడే మాయగాళ్ల వలలో పడకుండా జాగ్రత్త పడాలి... ప్రేమ వ్యవహారాలు బెడిసికొట్టును.. నమ్మక ద్రోహం కలుగును.. పరువు ధనం నష్టం... ఎవరిని పడితే వాళ్లను గ్రుడ్డిగా నమ్మవద్దు...20 నవంబర్ 2021 నుండి వృషభరాశి వారికి గురువు యోగించి శుభఫలితాలు ఇస్తాడు.వృత్తి విద్యా కోర్సులు చదివిన వారికి ఉద్యోగ అవకాశములు కలుగుతాయి,అమ్మాయిల కు మరింత పరీక్ష కాలం..స్వయం ఉపాధి చేసుకునే వారికి విశేష లాభాలు కలుగుతాయి.విద్యార్థులకు అనుకూలమైన సమయం.తీర్ధ యాత్ర ప్రయాణములు 20 నవంబర్ 2021 తదుపరి పూర్తి చేయగలుగుతారు.సాంప్రదాయ బద్దమైన జీవితం ప్రారంభించడానికి అత్యంత అనుకూల కాలం.విడిచి పెట్టాలని అనుకున్న దురలవాట్లకు దూరం కాగలుగుతారు. కొన్ని దారిద్యాలు తొలగుతాయి...* శని భగవానుడు మంచి ఫలితాలను ఇస్తాడు .నూతన వాహన కోరిక నెరవేరును.వారసత్వ సంపద లభించును.పనిచేస్తున్న రంగములలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు.వ్యక్తిగత జాతకంలో శని బలంగా ఉంటే .. ఉద్యోగులకు పదవిలో ఉన్నతి లభింస్తుంది.అనుకున్నఆర్ధిక లక్ష్యాలను చేరుకొంటారు వ్యక్తిగత ఎవరి జాతకంలో శని స్వక్షేత్రంలో ఉన్ననులేదా ఉచ్చ స్థితి ఉన్ననూలేదా మూల త్రికోణములో ఉన్నవారు సులువుగా విశేషమైన ధనార్జన చేయగలరు.వీరు తమ వంశానికి, జాతికి పేరు ప్రఖ్యాతులు తెచ్చే .. సత్కార్యములు చేస్తారు.* రాహువు - కేతువుల వలన మిశ్రమ ఫలితాలు ఉంటాయి.సమాజంలో పేరు ప్రఖ్యాతులను పొందుతారు.ఉద్యోగులకు కోరుకున్న విధంగా స్థాన చలనం కలుగుతుంది.పితృ వర్గీయులతో ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోవును. పిత్ర బ్రాత ధన ప్రాప్తి.. కొంత శారీరకంగా అనారోగ్యం సమస్యలను మాత్రం ఎదుర్కొంటారు , అరోగ్య రక్షణ కల్పించుకోవాలి...వైవాహిక జీవతంలో తీవ్ర గొడవలు ఏర్పడే సూచలు ఉన్నాయి, కోప తాపాలు వద్దు.. ఓపిక పట్టండి... ప్రెస్టేజ్ కోసం అప్పులు చేయవద్దు..ఇంటి విషయాలు పట్టించుకోకుండా, వ్యసనాలకు బానిసై ఇంట్లో అశాంతి సృష్టిస్తున్న జీవిత భాగస్వామి మీద విసుగు పుడుతుంది,ఇది అందరికీ వర్తించదు .. వ్యక్తిగత జాతకంపై ఆధారపడి ఫలితం ఉంటుంది.* ( ఇతర అన్ని గ్రహ స్థానాలను ఆధారంగా ఫలితాలు ఇలా ఉండనున్నాయి. )గోచార గ్రహస్థితి వలన అనేక బరువు భాద్యతలు మోయవలసి వస్తుంది.తలపెట్టిన కార్యములలో విజయాన్ని సూచిస్తున్నాయి .ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది.వివాహయోగం ఉంది.వృత్తి, వ్యాపారాలలో ఆర్ధిక పురోగాభివృద్ది బాగుంటుంది.విదేశాలలో చదువుకునే అవకాశం లభిస్తుంది.ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది.ఆరోగ్య సమస్యలు ఉంటాయి. రోజు యోగాసనాలు, ధ్యానం చేయుట వలన కుదుటపడుతాయి .ముఖ్యమైన విషయాలలో పెద్దల మాట వినడం శ్రేయష్కరం అని గ్రహించండి .తల్లిగారి వైపు వంశ సూతకం వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి.వ్యవసాయ దారులకు సామాన్య లాభం కలుగుతుంది, కొంత జాగ్రత్తలు తీసుకోవడం అవసరం... అనవసర ఖర్చులు పెరగవచ్చు...ఉపాద్యాయులకు సన్మానం , తోటి ఉద్యోగులతో మంచి మిత్రుత్వం ఏర్పడుతుంది.రాజకీయ నాయకులకు అనుకూలం .. సెప్టెంబర్ లోగా ఏదైనా పదవి లభించే అవకాశం ఉంది. అధికార ప్రాప్తి.. కానీ కొంత మంది నీచులు మీ పై నిందలు మోపి అడ్డుకట్ట వేయడానికి పని చేసారు కానీ సంకల్పంతో మీరే విజయం సాధిస్తారు....విద్యార్ధులు చదువుపై ఎక్కువ కృషి చేయాలి. తల్లి తండ్రులు వారిని గమనిస్తూ ఉండాలి...అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు ప్రతీ రోజు దశ నామ రక్షా స్తోత్రము 11 మార్లు జపించండీ.. ప్రతీ అష్టమి అమావాశ్య పౌర్ణమి రోజుల్లో కాలచక్ర దీప పూజ చేయడం, నీటిలో 1 రాగి కాయిన్ 100 గ్రా.బెల్లం వేయడం ద్వారా శుభం కలుగుతుంది. భువనేశ్వరి అమ్మవారి పటానికి పసుపు రంగు పూలతో పూజించండి. కాలభైరవ అనుగ్రహ సిద్ధిరస్తు...సర్వేజనా: సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి:

#మేషరాశి_శ్రీప్లవనామసంవత్సర 2021-2022 ఉగాది వార్షిక ఫలితాలు #KalabhairavaTV మేషరాశి:- అశ్విని నక్షత్రం 1,2,3,4 పాదములు, భరణి నక్షత్రం 1,2,3,4 పాదములు, కృత్తిక నక్షత్రం 1వ పాదములో జన్మించినవారు మేషరాశికి చెందుతారు .శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఈ సంవత్సరంఆదాయం - 08, వ్యయం - 14 ,రాజపూజ్యం - 04, అవమానం - 03.🟡గురువు :- ఉగాది ప్రారంభం నుండి లాభస్థానమైన ( కుంభం) లో నవంబర్ 20 వరకు తామ్ర మూర్తిగా .. నవంబర్ తర్వాత లోహమూర్తిగా ఉంటాడు.* శని :- సంవత్సరం అంతా ... దశమ స్థానం ( మకరరాశి )లో తామ్రమూర్తిగా ఉంటాడు.* రాహు కేతువులు :- సంవత్సరం అంతా 2 , 8 ( వృషభ, వృశ్చిక ) రాశులలో లోహమూర్తులుగా ఉంటారు. వ్యతిరేక ఫలితాలు ఇస్తారు .వారసత్వ బ్రాత సంబంధ సంపద విషయంలో తగాదాలు ఎదుర్కొందురు.కుటుంబంలో శుభకార్య గృహ వస్తూ వాహన స్వర్ణ సంబంధమైన ఖర్చులు అధికం..ముఖ్యంగా పితృవర్గంలోని పెద్ద వయస్సు వారికి తీవ్ర ఆరోగ్య సమస్యలు మరియు ప్రాణ గండములు ఏర్పడే పరిస్థితి గోచరిస్తున్నది....వ్యక్తిగత జాతకంలో గురు గ్రహం నీచ క్షేత్రంలో ఉన్నవారు గురు దత్తాత్రేయ స్వామి మంత్రం జరిపించుట, ప్రతీ ఆదివారం పసుపు రంగు పండ్లు గురువులకు సమర్పించి వారి ఆశీస్సులు పొందుట మంచిది.* 20 - నవంబర్ -2021 నుండి గురువు అనుకూలమైన శుభ ఫలితాలను ఇస్తాడు.న్యాయమైన ధన సంపాదన కలిగించును.జీవన విధానంలో నూతన యోగములను ప్రసాదించును.* శని సంవత్సరం అంతా అనుకూలమైన శుభ ఫలితాలను ఇస్తాడు.ఆశించిన విధంగా ధన సంపాదన కలుగజేస్తాడు.నల్లని వస్తువులు,నల్లని ధాన్యములు,లోహములకు సంబంధించిన వ్యాపారం చేసే వారికి మంచి లాభములు కలుగజేయును.నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అగును. ఉద్యోగ ప్రాప్తి...సంతానం లేని వారికి సంతాన సౌఖ్యం కలుగచేయును.రాహువు సంవత్సరం అంతా మంచి ఫలితాలను ఇస్తాడు.* కేతువు అశుభత్వం వలన అనేక సమస్యలు ఏర్పడును.శారీరక సౌఖ్యం తక్కువ అగును.ప్రతి పనికి ఎక్కువగా శ్రమింప జేస్తాడు.ఎవరి వ్యక్తిగత జాతకంలో పితృ స్థానంలో కేతు గ్రహ దోషములు ఉన్నవారికి పితృ ఖర్మలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడు సూచనలు ఉన్నాయి.ఆధ్యాత్మిక జీవన సాధనలో ఆశించిన పురోగతి లభించక మరింత పరీక్షలు ఎదురు అగును.. దైవోపాసన చేయలనుకునే వారికి కొన్ని విఘ్నములు ఏర్పడుతాయి. సంకల్పంతో భక్తి తో సాధించవచ్చు..కొన్నివిషయాలలో మీ ప్రమేయమేమి లేకుండానే అపవాదులు నిందలు మరియు అవమానములను పొందడాన్ని సూచించుచున్నది. జాగ్రత్త ఎవరితోనూ అనవసరంగా ఎక్కువ మాట్లాడ వద్దు..వృత్తి, ఉద్యోగాలలో స్థిరత్వం వస్తుంది.ప్రేమ వ్యవహారం పట్ల నమ్మక ద్రోహం.. సమయం వృధా, ధన నష్టం, కీర్తి ప్రతిష్టలకు నష్టం, పెద్దవారికి ప్రాణ గండం... అవివాహితులకు వివాహయోగం కల్గుతుంది. ఉత్తమ జీవిత భాగస్వామి యోగం...సంతానప్రాప్తి. ( దంపతులిరువురి వ్యక్తిగత జాతకాల ఆధారంగా ఫలితాలు ఉంటాయి )ఆత్మీయులతో, జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి.స్వార్ధ పరులు, ఆవకాశవాదులు మీ దరిచేరుతారు, దొంగలను నమ్ముతారు.. వారి మాయలో పడి ధనం పరువు పోగొట్టుకుంటారు.. కేసుల్లో కోర్టు గొడవల్లో ఇరుక్కోవడం జాగ్రత్తలు వహించవలెను.స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు.వాహన యోగం,గృహ యోగం.రాజకీయ రంగాలవారికి పదవియోగం.స్త్రీలతో విరోధం. పరస్త్రీ, పరపురుష, అక్రమ సంబంధముల వల్ల కీర్తి ప్రతిష్టలకు భంగం, పదవీ గండం, అధికారం కోల్పోవడం, అప్పుల పాలు అవ్వడం, గుట్టు రట్టవడం, విలువ లేని వారితో కూడా మాటలు పడడం... కేసుల్లో ఇరుక్కోవడం జరిగే అవకాశం జాగ్రత్త పడాలి..అంతర్గత రాజకీయాలు పెరుగుతాయి. మీపై కుతంత్రాలు పన్ని పదవిని సైతం ఉడగొడతానికి పన్నాగాలు పన్నుతారు.. మీ ఫోన్లు టాప్ చేయడం... రహస్య వీడియోలు తీయడం మీపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరిగే అవకాశం... జాగ్రత్త మీ చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోండి.... ఈ సంవత్సరం తలపెట్టిన కార్యాలు మూడు వంతులు పూర్తిచేస్తారు.వ్యవసాయ దారులకు రెండు పంటలు లాభిస్తాయి. ధన వృద్ది... ఉద్యోగులకు పదోన్నతులు కల్గుతాయి.నూతనంగా వ్యాపారం చేయాలనుకునే వారికి అనుకూలంగా ఉంది.విద్యార్ధులకు ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులైయ్యే అవకాశాలున్నాయి . దశ నామ రక్షా స్తోత్రము జపించండి..సినిమా, టీవి, రంగాల వారికి కాస్త మంచి దారి కనిపిస్తుంది... మిమ్మల్ని మీ టాలెంట్ ను వాడుకుని వదిలేసే వారు ఉంటారు... జాగ్రత్త... మీ ఫోన్లు టాప్ చేయడం... రహస్య వీడియోలు తీయడం మీపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతుంది... #KalaBhairavaGuruGantalaPanchangamఅనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు ప్రతీ ఆదివారం మీ గృహంలో సాయంత్రం 4.30 నుండి 6 గం. ల మధ్య లో ఒక ఇత్తడి ప్లేట్ లో కుంకుమతో త్రికోణ 🔺 ఆకారం వేసి దాని మీద ఎండు కొబ్బరి ఉంచి నువ్వుల నూనెతో దీపారాధన చేసి పంచ పూజలు చేసి కాలభైరవ సహస్రనామ స్తోత్రం పారాయణ ఒకసారి చేయండి. కాళీ, బగలా ముఖీ అమ్మవారిమంత్రం రోజూ ఒకమాల జపించండి. సింధూరము కలిపిన అక్షతలతో,ఎర్రని పూలతో పూజించండి.. ఆదివారం 27 మార్లురావివృక్ష ప్రదక్షణ చేయండి.. శుభం కలుగుతుంది...కాలభైరవ అనుగ్రహ సిద్ధిరస్తు...సర్వేజనా: సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి:

Monday, April 12, 2021

శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాదికి స్వాగతం సుస్వాగతం #ugadi2021#ఆయురారోగ్య_అష్టైశ్వర్యప్రాప్తిరస్తు.కాలభైరవఅనుగ్రహసిద్ధిరస్తు...వికారినామ సంవత్సరము(2019), పేరుకు తగినట్టుగా వికృతమైన పరిస్థితులను.. శార్వరి(అంటే, చీకటి) నామ సంవత్సరం (2020) విశ్వాన్ని అంధకార స్థితిగతులను.. ఇప్పుడు ప్లవ నామ సంవత్సరం మొదలైనది. ఇది శుభప్రదమైన సంవత్సరం గా బావిద్దాం..... ప్లవ అంటే, దాటించునది అని అర్థం. "దుర్భిక్షాయ ప్లవ ఇతి. తతశ్శోభనే భూరితోయం......." దుర్భరమైన ప్రతికూలతను దాటించి భూమికి శోభను చేకూరుస్తుంది అని వరాహసంహిత వివరించింది. అంటే చీకటి నుంచి వెలుగు లోకి నడిపిస్తుందని అర్థం. వికారి, శార్వరి తమ పేర్లకు తగ్గట్టుగా నడిపించాయి గదా. మరి ప్లవ తన పేరును సార్థకం చేసుకుంటుందని ఆశించటం తర్కసహితమైన ఆలోచనయేగదా. ప్లవ నామ సంవత్సరం ముగియగానే "శుభకృత్", ఆ తరువాతది " శోభకృత్" సంవత్సరములు. పేరుకు తగ్గట్టుగా ఇవి కూడనూ మన మనసుకు సంతోషాన్ని, వికాసాన్ని కలిగిస్తాయి. అభయాన్ని ప్రసాదిస్తాయి.అందుకే, ప్లవ నామ సంవత్సరానికి స్వాగతం, సుస్వాగతం...http://www.facebook.com/kalabhairavaTV

Friday, April 9, 2021

#KottaAmavasya#ShaniAmavasya#AadivaaramAmavasya#అమవాస్యకాలభైరవదర్శనంచెడు ప్రభావం తగ్గాలంటే కొత్త అమావాస్య రోజున పాటించాల్సిన విషయాలివే.. ప్రతినెలా కృష్ణపక్షం చివరి రోజు అమావాస్య వస్తుంది. ఈ విధంగా సంవత్సరంలో 12 అమావాస్యలు వస్తాయి. ఇదే విధంగా ఏప్రిల్ 11న ఈ కృష్ణపక్షం అమావాస్య. దీనిని ఫాల్గుణ అమావాస్య అని పిలుస్తారు. Shani Amavasya: Ways to Make Lord Shani Happy: దీనిని ఫాల్గుణ అమావాస్య అని పిలుస్తారు. రేపటి రోజును ఉత్తరాభాద్ర నక్షత్రముతో కూడిన అమావాస్య కాబట్టి (Shani Amavasya) అని కూడా అంటారు. ఏది ఏమైనా హిందూ మతంలో అమావాస్యకు ప్రాముఖ్యత ఉంది. అమవాస్య ఆదివారం వస్తే పితృ దేవతల అనుగ్రహ పర్వదినం..పితృ దోషాల నివారణ కోసం కొన్ని వస్తువులు, పదార్థాలు దానం చేస్తుంటారు. పెద్దలు పేరు మీద వస్త్రదానం, అన్నదానం చేసి పితృ దోషాలు (Pitra Dosh)ను పరిష్కరించుకుంటారు. అమావాస్య ఆదివారం పడితే, దాని ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. ప్రస్తుతం ఆదివారం రోజు ఏర్పడుతున్న అమావాస్యకు చాలా ప్రాధాన్యాత సంతరించుకుంది. ఈఅమావాస్యరోజున గృహంలో పూజా మందిరంలో ఇత్తడిప్లేట్ లో కుంకుమతో త్రికోణారం 🔺 వేసి దానిపై ఎండుకొబ్బరిలో నల్లనువ్వుల నూనెతో దీపారాధన చేసి, మీ కుల, గ్రామ, గురు, ఇష్ట, కాలభైరవ దేవతల ను ఆవాహన చేసి , పంచ పూజలు నిర్వహించి స్వర్ణ భైరవ మంత్ర, కాలభైరవ అష్టకం, సహస్ర నామ స్తోత్రం పారాయణ చేస్తూ సిందూరం కలిపిన అక్షతలతో ఎర్రని పూల తో దీపాన్ని, స్వామివారిచిత్రపటాన్ని పూజించండి. నల్ల మినపప్పుతో చేసిన గారెలు, వడపప్పు, పానకం నివేదన చేయాలి. అమావాస్య రోజున ఏవిధంగా గృహంలో చేయడం వల్ల పితృ దేవతల, కుల, గ్రామ, గురు, కాలభైరవ, నవగ్రహ దేవతల అనుగ్రహాన్ని పొందడం కోసం అద్భుతమైన పర్వదినం. మరియు అశాంతి, ఋణ, శత్రు, రోగ, శని సాడేసాతి అష్టమశని, అర్ధాష్టమ శని, కుజ, సర్ప, కాలసర్ప ప్రభావాలను నివారించడానికి ఈ దీపపూజ చక్కని పరిష్కారం.. - ఆదివారం అమావాస్య ఉదయం సూర్య భగవానుడికి నమస్కారం, అర్ఘ్యము సమర్పించ వలెను..- ఆదివారం అమావాస్య రోజున, రావిచెట్టును సందర్శించి స్వర్ణాకర్షణ మంత్రం జపిస్తూ.. చెట్టుకు ఎరుపు రంగుదారం కట్టడం వల్ల ధనప్రాప్తి, ఉత్తమ జీవితభాగస్వామి, ఉద్యోగప్రాప్తి, ఉద్యోగఉన్నతి, మరియు సర్వ శుభాలు కలుగుతాయని భావిస్తారు. అందువల్ల, కాలభైరవ స్వామి అనుగ్రహంకోసం, గృహప్రాప్రి కొసం, విదేశీ ఉద్యోగ ప్రాప్రి కొసం ఆరోజు రావిచెట్టు కింద మట్టి ప్రమిదలో నూనెతో దీపం వెలిగించి, కాల భైరవ సహస్ర నామ స్తోత్రం పారాయణ చేయండి.. #ధనమును(నాణాలను) ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక శ్రీలక్ష్మీకుబేర స్వర్ణాకర్షణ భైరవస్వామి వారు.రాజమండ్రి. ఆదివారం, అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మాత్రమే ఉ.9గ.నుండి ఉ.11:45ని. వరకు మాత్రమే ఉంటుంది. ఏవిధమైన పూజా సామాగ్రి తీసుకురావద్దు.. #కాలభైరవగురుసంస్థాన్ మఠం నిర్వహించు సేవలు:*భారతీయ సనాతన,ధర్మ ప్రచారసేవ*ఉచిత దర్శనసేవ*ఉచిత జలాభిషేకసేవ*ఉచిత హారతిదర్శనసేవ*ఉచిత ధనప్రసాదసేవ*ఉచిత అన్నప్రసాదసేవ*ఉచిత మంత్ర ఉపదేశ సేవ*మాతృపితృ పాదపూజా ప్రచార సేవ భారత్ మాతా కీ జై!!భారతీయసనాతనధర్మంవర్ధిల్లాలి!!Like and Follow Us..http://www.facebook.com/kalabhairavaTVFor Address Location..https://maps.app.goo.gl/j3HcFLHwmRLUSgU56Our website..www.kalaBhairava.inOur YouTube... https://www.youtube.com/c/KALABHAIRAVAGURUAnnadanam Seva..అన్నదానం భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఎప్పుడూ ఒక భాగం. ఈ పవిత్ర సంప్రదాయాన్ని కొనసాగించడంలో మేము మీ మద్దతును కోరుతున్నాము... సేవలో తరించాలంటే GooglePay, PhonePe, Paytm 9000 200 117లేదా Online Annadana Seva. *KALABHAIRAVAGURU SANSTHAN MUTT**Account No:0113020551Kotak MAHINDRA BANK*IFSC:KKBK0007876 *DANAVAIPETA BRANCH.